
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్, లాసెట్, పీజీ ఈసెట్.. ఈ మూడు సెట్స్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి గురువారం తెలిపారు. మే నెల 5, 6, 7 తేదీల్లో జరగాల్సిన ఎంసెట పరీక్షలు.. మే నెల 4, 7, 8 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. అదే విధంగా మే 25 తేదీన జరగాల్సిన లాసెట్ పరీక్షను మే 27 వ తేదిన జరుగుతుందన్నారు. పీజీసెట్ పరీక్ష 27 నుంచి 30 వరకు జరగాల్సి ఉండగా 28 నుంచి 31 వరకు జరుగుతాయని కొత్త షెడ్యూల్‌లో ఆయన పేర్కొన్నారు.
దీంతోపాటు పరీక్ష ఫీజులు ఈ ఏడాది పెంచటం లేదన్నారు. గురువారం నిర్వహించిన కన్వీనర్ సమావేశంలో ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోలేదని పాపిరెడ్డి చెప్పారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించడం కోసం కన్వీనర్‌లకు పలు కీలక సూచనలు ఇచ్చామని ఆయన అన్నారు. ఫేస్ రికగ్నిషన్ సిస్టం గురించి తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్( టీఎస్‌టీఎస్)తో మాట్లాడి అవగాహన చేసుకున్న తర్వాతనే అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రంజాన్ పండుగ ఉండటం వల్ల పరీక్ష తేదీలను మార్చటం జరిగిందని పాపిరెడ్డి వెల్లడించారు.
చదవండి: సెట్ కన్వీనర్లు ఖరారు
Comments
Please login to add a commentAdd a comment