
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఎంసెట్ ఆప్షన్ల ప్రక్రియ క్రమంగా ఊపందుకుంటోంది. బుధవారం రాత్రివరకు 58,807 మందికిపైగా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 3 లక్షలకుపైగా ఆప్షన్లను ఎంపిక చేసుకున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్య విభాగం పేర్కొంది. ఒక విద్యార్థి గరిష్టంగా 1,013 ఆప్షన్లు ఇచ్చినట్టు తెలిపింది. సెప్టెంబర్ 2తో కౌన్సెలింగ్ గడువు ముగుస్తుంది. తొలిదశ సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 6న ఉంటుంది. మరోవైపు 8 వేల మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. చాలా మంది కుల, ఆదాయ ధ్రువపత్రాలు తెచ్చుకునే పనిలో ఉన్నారు. దీనివల్ల విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
తొలి ప్రాధాన్యత కంప్యూటర్ సైన్స్‌కే..
మొదటి విడత కౌన్సెలింగ్ మొదలయ్యే సమయానికి యూనివర్సిటీల నుంచి కాలేజీల అనుబంధ గుర్తింపు జాబితా అందలేదు. దీంతో గతే డాది కౌన్సెలింగ్‌లో పెట్టిన 175 కాలేజీలనే ఈసారి అప్‌లోడ్ చేశారు. వాటిలో 65,633 సీట్లు ఉన్నట్టు చూపారు. ఈ సీట్ల సంఖ్యలో మార్పులు చేర్పులుండే వీలుందని అధికారులు అంటున్నారు. ఇప్పటి వరకు విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టి ఫిషియల్ ఇంటెలి జెన్స్, సైబర్ సెక్యూ రిటీ, డేటా సైన్స్ వంటి కంప్యూటర్ కోర్సులకే ఎక్కువగా ఆప్షన్లు ఇస్తున్నట్టు అధికారులు తెలిపా రు. 90% మంది తొలి ప్రాధాన్యతగా సీఎస్‌సీ, ఇతర కంప్యూటర్ కోర్సులనే ఎంచుకున్నారని.. తర్వాత ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్ కోర్సులు ఉన్నాయని వివ రించారు. ఈసారి సీట్లు కూడా కంప్యూట ర్ కోర్సుల్లో పెరిగి, సివిల్, మెకానికల్ విభాగంలో తగ్గే అవకాశం ఉందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment