Engineering admission
-
ఫార్మసీ ప్రవేశాలకు వేళాయే
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్–2024)కు సంబంధించిన ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీసీ స్ట్రీమ్‌లో బీ.ఫార్మసీ, ఫార్మా–డీ కోర్సులతోపాటు బైపీసీ స్ట్రీమ్‌లో బీఈ, బీ.టెక్‌లలో బయో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మాసూ్యటికల్ ఇంజనీరింగ్, బీ.ఫార్మసీ, ఫార్మా–డీ కోర్సుల సీట్ల భర్తీ కోసం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహణకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేశాయి. ఏపీ ఈఏపీసెట్–2024లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చొప్పున ట్ఛ్టట.టఛిజ్ఛి.్చp.జౌఠి.జీn లో లాగిన్ అయ్యి క్రెడిట్ కార్డు, డెబిట్‌కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు శనివారం రాత్రి వరకు అవకాశం ఉంది. డిసెంబర్ ఒకటో తేదీ వరకు విద్యార్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లను ఎంపిక చేసిన హెల్ప్‌లైన్ కేంద్రంలో పరిశీలిస్తారు. శని, ఆదివారాల్లో కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు డిసెంబర్ 2వ తేదీ ఒక్క రోజు అవకాశం ఉండగా, 4వ తేదీన సీట్లు కేటాయిస్తారు. డిసెంబర్ 4 నుంచి ఆరో తేదీలోపు కళాశాలల్లో చేరాల్సి ఉంది. బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు శనివారం నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. కళాశాలల ఎంపిక కోసం 3 నుంచి 7వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. 8వ తేదీన వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు. డిసెంబర్ 11 సీట్లను కేటాయిస్తారు. అదే రోజు నుంచి 14వ తేదీలోపు కళాశాలల్లో చేరాలి. -
కోర్ గ్రూపులకు కష్టకాలం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో సివిల్, మెకాని కల్, ఎలక్ట్రికల్ బ్రాంచీలకు ఆదరణ కరువవుతోంది. గత నాలుగేళ్లలో ఈ గ్రూపుల్లో 10 వేల సీట్లు తగ్గిపోగా, ఈ ఏడాది (2024–25) మరో 6 వేల సీట్లు కనుమరుగయ్యాయి. డిమాండ్ లేని బ్రాంచీల్లో సీట్లు తగ్గించి, ఆదరణ ఉన్న బ్రాంచీల్లో పెంచుకునేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతించడంతో అన్ని కాలేజీలూ ఇదే బాట పడుతున్నాయి. కోర్ గ్రూపుల్లో సీట్లు తగ్గించుకుని కంప్యూటర్ కోర్సు ల్లో పెంచుకుంటున్నాయి. కేవలం నాలుగేళ్లలోనే కంప్యూటర్ కోర్సుల్లో 11 వేల సీట్లు పెరిగాయి. ఈ పరిస్థితి జిల్లాల్లోని ఇంజనీరింగ్ కాలే జీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. కంప్యూటర్ కోర్సుల నిర్వహణ ఆ కాలేజీలకు కష్టమ వుతోంది. మౌలిక వసతుల కల్ప న, నాణ్యమైన ఫ్యాకల్టీ సమకూర్చుకోవడం కత్తిమీద సాములా మారింది. దీంతో పలు జిల్లాల్లో 2014–24 మధ్య 90కిపైగా కాలేజీలు మూతపడ్డాయి. ఒక్క వరంగల్ జిల్లాలోనే నాలుగేళ్లలో 8 కాలేజీలు కనుమ రుగయ్యాయి. ఆదిలాబా ద్లో మూడు కాలేజీలుంటే ఇప్పుడు ఒక్కటీ లేదు. నిజామాబాద్‌లో గతంలో ఆరు ఉంటే ఇప్పుడు నాలుగున్నాయి. ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీ రింగ్ విద్య కోసం రాజధానినే ఎంచుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ కాలేజీలుంటే, 109 కాలేజీలు మేడ్చల్–మల్కా జిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మేడ్చల్‌లో 45, రంగారెడ్డిలో 44, హైదరాబాద్‌లో 20 కాలేజీలున్నాయి. మార్చేస్తున్న పోటీ ఇంజనీరింగ్ తర్వాత కన్పించేవన్నీ సాఫ్ట్వేర్ ఉద్యో గాలే. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సులు చేసినా ఉపాధి కోసం వెతుక్కోవాల్సింది ఐటీ సెక్టార్లోనే. దీనివల్లే విద్యార్థులు కంప్యూటర్ కోర్సుల్లో చేరేందుకే ఇష్టపడుతున్నారు. రాష్ట్రంలో ఏటా లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు తయారవుతుండగా, 70 శాతం కంప్యూటర్ సైన్స్ నేపథ్యంతోనే వస్తున్నారు. వీరిలో కేవలం 10 శాతం మందికి కూడా స్కిల్స్ ఉద్యోగాలు దొరకట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సీఎస్ఈ చేసినా బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండటం లేదని పారిశ్రామిక వేత్తలు అంటున్నారు. ఇంజనీరింగ్‌తోపాటు ఏదో ఒక కొత్త కోర్సు నేర్చుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుతూనే పార్ట్‌టైం ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ అవకాశాలన్నీ హైదరాబాద్‌లో ఉంటేనే సాధ్యమని విద్యార్థులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు లేకపోవడంతో ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టు వర్క్ లాంటివీ సాధ్యం కావట్లేదు. ఆ కోర్సుల జాడెక్కడ?గత ఐదేళ్లల్లో సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి కోర్ గ్రూపుల్లో ప్రవేశాలు భారీగా తగ్గాయి. ఈ బ్రాంచీల్లో సీట్లను కాలేజీలు తగ్గిస్తున్నాయి. 2020 సంవత్సరంలో ఈ గ్రూపుల్లో కన్వీనర్ కోటా కింద 40,355 సీట్లుంటే, 2024 నాటికి ఇవి 30,900కు పడిపోయాయి. ఉన్న సీట్లలోనూ ప్రవేశాలు 50 శాతం మించడం లేదు. కానీ సీఎస్ఈ, ఐటీ సహా కంప్యూటర్ బ్రాంచీల్లో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు. కాలేజీలు కూడా ఈ గ్రూపుల్లో సీట్లు పెంచుకునేందుకు బారులు తీరుతున్నాయి. 2020లో కంప్యూటర్ బ్రాంచీల్లో 58,633 సీట్లుంటే, 2024 నాటికి 67,248 సీట్లయ్యాయి. 65.13 శాతం నుంచి 76.46 శాతం సీట్లు ఈ గ్రూపుల్లో పెరిగాయి. ఇతర కోర్ గ్రూపుల్లో మాత్రం 2020–24 మధ్య 37.87 శాతం ఉన్న సీట్లు 23.54 శాతానికి పడిపోయాయి. -
2,640 ఇంజనీరింగ్‌లో పెరిగిన సీట్లు..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో సీట్లు మరో 2,640 పెరిగాయి. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏఐఎంఎల్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ బ్రాంచీలకు సంబంధించినవే కావడం గమనార్హం. కాగా కొత్త వాటితో కలుపుకొని మొత్తం 1,01,661 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 72,741 సీట్లు కన్వీనర్ కోటా కింద ఉంటాయి. వాస్తవానికి కొత్తగా 20 వేల సీట్ల పెంపునకు కాలేజీలు దరఖాస్తు చేశాయి. అయితే ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు పెంచడాన్ని అధికారులు వ్యతిరేకించారు. అన్ని సదుపాయాలు, ఫ్యాకల్టీ ఉన్న 20 కాలేజీల్లో కూడా ప్రతీ బ్రాంచిలో 120 సీట్లకు మించి పెంచడం సరికాదని ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేవలం 2,640 సీట్లకు మాత్రమే అనుమతి తెలిపింది. సీట్ల పెరుగుదల నేపథ్యంలో ఈ నెల 17 వరకు ఆప్షన్లు ఇచ్చుకునే వెసులుబాటు కల్పించినట్టు సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన తెలిపారు. ఇప్పటివరకు 95,383 మంది ఆప్షన్లు ఇచ్చారని వెల్లడించారు. మరో 4 వేల సీట్లకు చాన్స్..కొత్త కంప్యూటర్ కోర్సులు వచ్చిన నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) వంటి బ్రాంచీలకు ఆదరణ తగ్గింది. దీంతో ఈ కోర్సుల స్థానంలో సీఎస్ఈ, ఇతర కంప్యూటర్ కోర్సులకు అనుమతించే అంశాన్ని అధికారులు పరి శీలిస్తున్నారు. ఇదే జరిగితే మరో 4 వేల సీట్లు వచ్చే అవకాశం ఉంది. మరో విడత కౌన్సెలింగ్‌కు ఈ సీట్లు అందుబాటులోకి వచ్చే వీలుంది. కాగా ఈ ఏడాది సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీలు రద్దు చేయాలని పలు కాలేజీలు దరఖాస్తు పెట్టుకున్నాయి. ఈ సీట్లు 3 వేల వరకూ ఉన్నాయి. అయితే యూనివర్సిటీలు గుర్తించిన సీట్లు మాత్రం 1,770 సీట్లు మాత్రమే. వీటి స్థానంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్లు ఇచ్చే విషయంలో ప్రభుత్వం విముఖతతో ఉంది. సీఎస్ఈ, ఇతర కంప్యూటర్ నాన్ కోర్ గ్రూపులు కలిపి 48 వేల కన్వీనర్ కోటా సీట్లుండగా, మెకానికల్‌లో 2,979, సివిల్‌లో 3,132, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 4,202 సీట్లు మాత్రమే ఉన్నాయి. వాస్తవానికి ఈ సీట్లలో కూడా ఏటా 40 శాతం మించి ప్రవేశాలు ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే ఉన్న ఆ కొన్ని సీట్లను తగ్గించేందుకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. కొత్త సీట్లపై తర్జనభర్జన..వాస్తవానికి కొత్త సీట్ల విషయంలో ప్రభుత్వం తర్జనభర్జన పడింది. సీట్లు పెంచడం వల్ల పడే ఆర్థిక భారంపై ఆరా తీసింది. కన్వీనర్ కోటా కింద కేటాయించే ప్రతి సీటుకు రూ.35 వేల వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి. 10 వేల లోపు ర్యాంకు వస్తే మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం సగటున ఏడాదికి రూ.35 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. నాలుగేళ్లకు రూ. 100 కోట్ల భారం పడుతుందని లెక్కగట్టారు. -
ఈఏపీసెట్, నీట్ విద్యార్థులకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో మాక్ టెస్ట్‌లు
సాక్షి ఎడ్యుకేషన్: ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం..ఇంజినీరింగ్, లేదా మెడిసిన్. అధిక శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజినీరింగ్/మెడికల్ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అందుకు ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్‌లో చేరి్పస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్..అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్/అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లున్కల్పించే ఈఏపీసెట్‌కు లక్షల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో ఈఏపీసెట్, నీట్ పరీక్షలకు ‘సాక్షి’ మాక్ టెస్ట్‌లు నిర్వహించనుంది. దీనికి టెక్నాలజీ పార్ట్నర్గా ‘మై ర్యాంక్’ వ్యవహరిస్తోంది. పరీక్షకు కొద్దిరోజుల ముందు వాస్తవ పరీక్ష లాంటి వాతావరణంలో జరిగే ‘సాక్షి’ మాక్ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్స్ స్థాయిని అంచనా వేసుకుని, దాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు https://www.arenaone.in/mock ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్న్ఫీజు రూ.250గా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్‌కు ఏప్రిల్ 22 చివరి తేదీ. రిజిస్టర్ చేసుకున్న ఈ మెయిల్‌కు హాల్ టికెట్ నంబర్ వస్తుంది. ఏప్రిల్ 27న నీట్, ఏప్రిల్ 28న ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఇంజినీరింగ్ పరీక్షలుంటాయి. ఈ ఆన్లైన్ టెస్ట్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు. పరీక్షా సమయం 3 గంటలు. ఈ పరీక్షలకు హాల్ టికెట్ నంబర్ (యూజర్ నేమ్), ఫోన్ నెంబర్ (పాస్వర్డ్)తో ఆ సమయంలో ఎప్పుడైనా లాగిన్ అయ్యి రాసుకోవచ్చు. పరీక్ష ముగిసిన వెంటనే స్కోర్‌ను వెంటనే చెక్ చేసుకోవచ్చు. మాక్ పరీక్షలను https://sakshimocktest.myrank.co.in లో నిర్వహిస్తారు. టెస్ట్ కీ ని ఏప్రిల్ 30న ఇదే వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. çపూర్తి వివరాలకు 95055 14424, 96660 13544, 96665 72244 నంబర్లకు కాల్ చేయవచ్చు. -
ఈఏపీసెట్‌లో ‘ఇంటర్’కు వెయిటేజీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్–2023లో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ ఇవ్వనున్నారు. ఇంటర్ మార్కులకు 25 శాతం మేర వెయిటేజీ ఇచ్చి ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ర్యాంకులను ప్రకటించనున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా నిలిపేవేసిన ఇంటర్ మార్కుల వెయిటేజీ విధానాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఇదే విషయాన్ని ఇటీవల విడుదలైన ఈఏపీసెట్ నోటిఫికేషన్లో కూడా పొందుపరిచింది. కాగా ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేయడానికి ఇంటర్లో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి అని స్పష్టం చేసింది. సెట్‌కు ఆన్లైన్ దరఖాస్తులను ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 15 వరకు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుములతో మే 14 వరకు స్వీకరిస్తారు. ఇందులో భాగంగా మే 15 నుంచి 18 వరకు ఎంపీసీ విభాగం, మే 22, 23 తేదీల్లో బైపీసీ విభాగం పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారు. కాగా ఈఏపీసెట్ దరఖాస్తు, ఇతర అంశాల్లో విద్యార్థులకు సహకారం అందించడానికి రాష్ట్రంలో అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోనూ రీజినల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యా మండలి ప్రతిపాదనల మేరకు.. కరోనాకు ముందు వరకు ఏపీ ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ అమల్లో ఉండేది. ఇందులో భాగంగా ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కులకు 75 శాతం, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ప్రకటించేవారు. ఈ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయించేవారు. అయితే కరోనా వల్ల 2020, 2021 విద్యా సంవత్సరాల పరీక్షలు జరగలేదు. దీంతో ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీని ప్రభుత్వం ఎత్తేసింది. ఈ రెండు సంవత్సరాల్లోనూ ఈఏపీసెట్‌లోని మార్కులనే పూర్తిగా పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను కేటాయించింది. 2022 నుంచి పరిస్థితులు సద్దుమణిగి ఇంటర్ తరగతులు సజావుగా సాగుతుండడంతో ఉన్నత విద్యామండలి ప్రతిపాదనల మేరకు ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ విధానాన్ని ప్రభుత్వం పునరుద్ధరించింది. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ రాసిన విద్యార్థులు 2022లో ఫస్టియర్ పరీక్షలు రాశారు. ఫస్టియర్, సెకండియర్ పరీక్షలను విద్యార్థులంతా పూర్తిస్థాయిలో రాయడంతో ఇంటర్ మార్కులకు ఈఏపీసెట్–2023లో వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యామండలి నివేదించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం, ఈఏపీసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ప్రకటించనున్నారు. సిలబస్‌పైనా స్పష్టత కాగా ఈఏపీసెట్–2023 సిలబస్‌పైనా ఉన్నత విద్యామండలి స్పష్టతనిచ్చింది. కరోనా సమయంలో తరగతులు, పరీక్షలు నిర్వహించకపోవడంతో ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు వెనుకబడ్డారు. దీంతో ఇంటర్ బోర్డు 30 శాతం మేర సిలబస్‌ను కుదించింది. అప్పట్లో నిర్వహించిన పరీక్షలకు కుదించిన సిలబస్‌నే పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఈఏపీసెట్ పరీక్షల్లోనూ ఉన్నత విద్యామండలి.. బోర్డు నిర్ణయించిన విధానాన్నే అనుసరించాల్సి వచ్చింది. (చదవండి: అంగన్వాడీల్లో 243 పోస్టులు) -
కంప్యూటర్ కోర్సుల వైపే చూపు!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఎంసెట్ ఆప్షన్ల ప్రక్రియ క్రమంగా ఊపందుకుంటోంది. బుధవారం రాత్రివరకు 58,807 మందికిపైగా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 3 లక్షలకుపైగా ఆప్షన్లను ఎంపిక చేసుకున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్య విభాగం పేర్కొంది. ఒక విద్యార్థి గరిష్టంగా 1,013 ఆప్షన్లు ఇచ్చినట్టు తెలిపింది. సెప్టెంబర్ 2తో కౌన్సెలింగ్ గడువు ముగుస్తుంది. తొలిదశ సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 6న ఉంటుంది. మరోవైపు 8 వేల మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. చాలా మంది కుల, ఆదాయ ధ్రువపత్రాలు తెచ్చుకునే పనిలో ఉన్నారు. దీనివల్ల విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. తొలి ప్రాధాన్యత కంప్యూటర్ సైన్స్‌కే.. మొదటి విడత కౌన్సెలింగ్ మొదలయ్యే సమయానికి యూనివర్సిటీల నుంచి కాలేజీల అనుబంధ గుర్తింపు జాబితా అందలేదు. దీంతో గతే డాది కౌన్సెలింగ్‌లో పెట్టిన 175 కాలేజీలనే ఈసారి అప్లోడ్ చేశారు. వాటిలో 65,633 సీట్లు ఉన్నట్టు చూపారు. ఈ సీట్ల సంఖ్యలో మార్పులు చేర్పులుండే వీలుందని అధికారులు అంటున్నారు. ఇప్పటి వరకు విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టి ఫిషియల్ ఇంటెలి జెన్స్, సైబర్ సెక్యూ రిటీ, డేటా సైన్స్ వంటి కంప్యూటర్ కోర్సులకే ఎక్కువగా ఆప్షన్లు ఇస్తున్నట్టు అధికారులు తెలిపా రు. 90% మంది తొలి ప్రాధాన్యతగా సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సులనే ఎంచుకున్నారని.. తర్వాత ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్ కోర్సులు ఉన్నాయని వివ రించారు. ఈసారి సీట్లు కూడా కంప్యూట ర్ కోర్సుల్లో పెరిగి, సివిల్, మెకానికల్ విభాగంలో తగ్గే అవకాశం ఉందని సమాచారం. -
14న ఎంసెట్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్–2022 నోటిఫికేషన్ ఈ నెల 14న వెలువడే అవకాశం ఉంది. దీనిపై సమీక్ష సమావేశం సోమవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగింది. ఈ భేటీలో నోటిఫికేషన్ వెలువరించేందుకు అవసరమైన ఏర్పాట్లకు అంగీకారం కుదిరిందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి మంగళవారం మీడియాకు తెలిపారు. అధికారులు తమకు సానుకూల తేదీలను సాంకేతిక తోడ్పాటును అందించే టీసీఎస్ సంస్థకు వివరించారు. ఈ సంస్థ ఆయా తేదీల్లో ఎంసెట్ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించి, నిర్దిష్ట మైన తేదీలను విద్యామండలి ముందుకు తేనుంది. ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులు హాజరయ్యే సెట్ లు, జేఈఈ, ఇతర జాతీయ పోటీ పరీక్షలను టీసీఎస్ పరిశీలించి.. ఇబ్బంది లేకుండా చూసేందుకే కసరత్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని పరీక్ష కేంద్రాలుండాలి? ఎక్కడ ఎక్కువ మంది పాల్గొనే అవకాశం ఉంది? అనే అంశాలను టీసీఎస్ పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ 2 రోజుల్లో పూర్తయ్యే వీలుందని, అనంతరం ఎంసెట్ తేదీలను ఖరారు చేసి, ప్రభుత్వ అనుమతికి పంపుతామని అధికారులు చెప్పారు. జూన్ చివరి వారం.. మే నెలలో ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తవుతాయి. ఇదే నెలలో జేఈఈ మెయిన్స్ పరీక్షలూ ఉంటాయి. ఇవన్నీ నిర్వహించిన తర్వాత ఎంసెట్ సన్నద్ధతకు విద్యార్థులు కనీసం నెల రోజుల వ్యవధి ఉండాలని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జూన్ చివరి వారం ఎంసెట్ నిర్వహణకు అనుకూలమైనదిగా ఉన్నత విద్యా మండలి అధికారులు నిర్ణయించారు. ఇదే విషయాన్ని టీసీఎస్‌కు వివరించినట్లు వారు తెలిపారు. దీంతో పాటే పరీక్ష పూర్తయిన నెల రోజుల్లోగా ఎంసెట్ ర్యాంకుల వెల్లడికీ కసరత్తు చేయాలని తీర్మానించారు. వాస్తవానికి గతంలో ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఉండేది. కానీ, ఈసారి దానికి అవకాశం లేదని ఇప్పటికే అధికారులు స్పష్టత ఇచ్చారు. ఫస్టియర్ పరీక్షల్లో కనీస మార్కులతో ప్రమోట్ చేశారు. కాబట్టి ద్వితీయ సంవత్సరంలో ఎంసెట్ అర్హత మార్కులు 40 శాతం ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా ఇంటర్ పరీక్ష ఫలితాలకు, ఎంసెట్ ర్యాంకుల వెల్లడికి సంబంధం ఉండదు. అందుకే త్వరగా ఫలితాలు వెల్లడించే వీలుంది. అలాగే కౌన్సెలింగ్ తేదీలపై మరికొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ ఫలితాలు, ఐఐటీ, నీట్ ప్రవేశాల తేదీలను బట్టి ఎంసెట్ కౌన్సెలింగ్‌ను ఖరారు చేయాలనే యోచనలో అధికారులున్నారు. -
ముఖ్యమంత్రి దాతృత్వం.. అతని కలను సాకారం చేశారు
భువనేశ్వర్: ఇంజినీరింగ్ చదువుకోవాలన్న ఓ పేద విద్యార్థి కలను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సాకారం చేశారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో 99.35 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, ఆర్థిక ఇబ్బందులతో కోర్సులో చేరేందుకు సతమతమవుతున్న బొలంగీరు జిల్లా, సింధెకెలా సమితి, బొడొపొడా గ్రామానికి చెందిన తారాచాన్ రాణాకి ముఖ్యమంత్రి ఆర్థికసాయం చేసి, దాతృత్వం ప్రదర్శించారు. వరంగల్ ఎన్ఐటీలో చేరి, ఇంజినీరింగ్ పూర్తి చేయాలన్నది ఆ విద్యార్థి లక్ష్యం. అయితే తన కుటుంబానికి తనని చదివించే స్తోమత లేదు. ఈ నేపథ్యంలో సీఎం సాయం కోసం సదరు విద్యార్థి అభ్యర్థించాడు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సదరు విద్యార్థి అడ్మిషన్ ఫీజు కింద అయ్యే ఖర్చుని తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. తక్షణమే రూ.96,500 నగదుని విద్యార్థికి సీఎం అందజేసి, బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. చదవండి: 7 నెలలకే భర్త పరార్.. అత్తవారింటి మెట్లపైన కోడలి పూజలు -
ర్యాంకు తెలియకున్నా.. సీటు కోసం పరుగులు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ‘కీ’విడుదల కావడంతో ఇంజనీరింగ్ సీట్ల కోసం విద్యార్థుల హడావుడి మొదలైంది. టాప్‌టెన్ కాలేజీల్లో సీట్లు రిజర్వ్ చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు. ఇక మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీపై ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా దృష్టి సారించాయి. ఆసక్తి చూపే విద్యార్థుల తల్లిదండ్రులతో బేరసారాలు చేస్తున్నాయి. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ టాప్‌టెన్ కాలేజీలో సీట్లు ఇప్పిస్తామని దళారులు ఆకర్షిస్తున్నారు. ప్రముఖ కాలేజీల్లో సీటుకు డొనేషన్ల రూపంలో లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు. ఫలితాలకు ముందే సీటు రిజర్వ్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. వాస్తవానికి ఎంసెట్ ఫలితాలు ఈ నెల 25న విడుదల చేస్తామని ఎంసెట్ కౌన్సిల్ ప్రకటించింది. 30 నుంచి మొదటి దశ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొంది. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ అయ్యాకే మేనేజ్మెంట్ సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టాలని, జేఈఈ ర్యాంకును కూడా పరిగణనలోకి తీసుకోవాలని కొన్ని ప్రధాన ప్రైవేటు కాలేజీలు కచ్చితమైన నిబంధనలు పెట్టుకున్నాయి. ఈ నెల 12న ఎంసెట్ ‘కీ’విడుదల చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులు ఇప్పటికే తమకు ఎన్ని మార్కులొస్తాయో అంచనా వేసుకున్నారు. అయితే ఇంటర్ మార్కుల ద్వారా వచ్చే 25 శాతం వెయిటేజ్ లేకపోవడంతో కచ్చితమైన ర్యాంకు అంచనా వేయలేకపోతున్నారు. ప్రభుత్వ, టాప్‌టెన్ కాలేజీల్లో సీటు సంపాదించే మార్కులు ఎంసెట్‌లో రాని వారు మాత్రం మేనేజ్మెంట్ కోటా కోసం యత్నిస్తున్నారు. వారి తల్లిదండ్రులు సీటు రిజర్వు చేసుకునే యోచనలో ఉన్నారని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ నిర్వాహకుడు తెలిపాడు. వెయిటేజ్ అంచనా కష్టమే..: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు 189 వరకు ఉన్నాయి. ఇందులో 175 వరకు ప్రైవేటు కాలేజీలే ఉన్నాయి. నిజానికి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ సీట్లు తగ్గాయి. మరోవైపు ఎంసెట్‌కు హాజరైన అభ్యర్థుల సంఖ్య పెరిగింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఈ ఏడాది 1,08,812 సీట్లకే అనుమతించింది. గతేడాది ఏఐసీటీఈ 1,11,143 సీట్లకు అనుమతించింది. కాలేజీల్లో మౌలిక సదుపాయాలను పరిగణనలోనికి తీసుకుని కొన్ని కాలేజీల సీట్లకు కోత పెట్టడం వల్ల 335 సీట్లు తగ్గాయి. ఈ ఏడాది 1,65,044 మంది ఎంసెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 81 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. కోవిడ్ కారణంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లడం ఇష్టం లేని వారు రాష్ట్రంలోనే ఇంజనీరింగ్ చేయాలని భావిస్తున్నారు. పరీక్షలు లేకపోవడంతో ఇంటర్మీడియట్లో అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఫలితంగా ఎంసెట్ అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ఏటా 45 శాతం ఇచ్చే ఇంటర్ వెయిటేజ్ కూడా లేకపోవడంతో ఎంసెట్ కౌన్సిల్ ప్రకటించే వరకు ర్యాంకు తెలిసే అవకాశం లేదు. సీఎస్ఈకి యమ డిమాండ్.. రాష్ట్రంలోని 175 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,05,419 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఎంసెట్ రాసిన వారిలో 80 శాతంపైగా మార్కులొచ్చిన వారు 52 శాతం మంది ఉన్నట్లు అంచనా. టాప్ టెన్ కాలేజీల్లో సీటు రావాలంటే 7 వేల లోపు ర్యాంకు తప్పనిసరి. ఎంసెట్‌లో 100 మార్కులకు పైగా వస్తేనే ఈ ర్యాంకు సాధ్యం. దీంతో నచ్చిన గ్రూపు, పేరున్న కాలేజీలో సీటు పొందాలంటే మేనేజ్మెంట్ కోటాకు వెళ్లక తప్పట్లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. వారిలో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ (సీఎస్ఈ)కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కాలేజీలు రూ.లక్షల్లో డొనేషన్లు వసూలు చేసేందుకు యత్నిస్తున్నాయి. ఇటీవల మలక్‌పేటకు చెందిన వ్యక్తి తన కూతురుకు 65 మార్కులు రావడంతో టాప్‌టెన్‌లో ఉన్న మహిళా కాలేజీలో సీటు కోసం ప్రయత్నించాడు. సీఎస్ఈకి దళారీ రూ.12 లక్షలు డిమాండ్ చేశాడు. కాలేజీ యాజమాన్యంతో బేరమాడి రూ.10 లక్షలకు సీటు ఇప్పిస్తానని చెప్పినట్లు ఆ వ్యక్తి చెప్పాడు. -
ఇంజనీరింగ్‘ర్యాండం’ విడుదల
సాక్షి, చెన్నై: ఇంజనీరింగ్ కోర్సులకు దరఖాస్తులు చేసుకున్న వారికి ర్యాండం నంబర్లను అన్నావర్సి టీ ప్రకటించింది. పది అంకెలతో కూడిన ఈ నం బర్లను బుధవారం ఉన్నత విద్యా శాఖ మంత్రి పళనియప్పన్ విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశ నిమిత్తం అన్నావర్సిటీ దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రభుత్వ కోటా కు చెందిన 2,05,463 సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ఏర్పాట్లు వేగవంతం చేశారు.జనరల్ కోటా కింద 1,68,760సీట్లు ఉన్నాయి. టెక్నికల్ కోటా కింద 4927, క్రీడా కోటా కింద 4852, వికలాంగుల కోటా కింద 485, మాజీ సైనికోద్యోగుల కోటా కింద 2518 సీట్లకు దరఖాస్తులు వచ్చి చేరాయి. ఈ దరఖాస్తులకు ర్యాండం నంబర్లను కేటాయించి కౌన్సెలింగ్‌కు ఆహ్వానించేందుకు సర్వం సిద్ధం చేశారు. పది అంకెలతో కూడిన ర్యాండం నెంబర్లను బుధవారం విడుదల చేశారు. కేటాయింపు: అన్నావర్సిటీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఈ నంబర్లను ఉన్నత విద్యా శాఖ మంత్రి పళనియప్పన్ విడుదల చేశారు. ఈ ఏడాది 1624619511 నుంచి ర్యాండం నెంబర్లు ప్రారంభం అయ్యాయి. వచ్చిన దరఖాస్తుల్లోని మార్కులు, పుట్టిన తేదీ, పేర్లు తదితర అంశాల వారీగా ఈ నంబర్లను కేటాయించారు. ఎలాంటి గందరగోళానికి ఆస్కారం ఇవ్వని రీతిలో ఈ నంబర్లను కేటాయించారు. వీటి ఆధారంగా విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. తమ నంబర్లను అన్నా వర్సిటీ వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు తెలుసుకోవచ్చు. ఇక ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ర్యాంకుల జాబితాను ఈనెల 16వ తేదీ విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. ఈ ఏడాది ప్లస్‌టూలో 200కు 200 మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య కోకొల్లలు. ఈ దృష్ట్యా, తొలి ర్యాంకు జాబితాలో అత్యధిక శాతం విద్యార్థులు ఉండే అవకాశం ఉంది. రెండు, మూడు ర్యాంకుల జాబితాలోని కటాఫ్ మార్కులు 199.75, 199.50 ఆధారంగా ఆ జాబితాలోను విద్యార్థుల సంఖ్య చాంతాడంత ఉండే అవకాశం ఉంది. జనరల్ కోటా కౌన్సెలింగ్ ఈనెల 27న ప్రారంభం కాబోతున్నా, ఈనెల 17 నుంచి క్రీడా తదితర కోటా సీట్ల కేటాయింపుల పర్వం ఆరంభం కానుంది. ఈ ఏడాది ప్రభుత్వ కోటా సీట్ల కన్నా తక్కువగా దరఖాస్తులు వచ్చిన దృష్ట్యా, అందరికీ సీట్లు గ్యారంటీ. అయితే, ప్రధాన కళాశాలలు, కోర్సుల ఎంపిక లక్ష్యంగా విద్యార్ధులు రెడీ అవుతున్నారు. ఎంబీబీఎస్‌కు జాప్యం:ఎంబీబీఎస్ ర్యాండం నం బర్ల విడుదల జాప్యం కానుంది. గురువారం నం బర్ల విడుదలకు తొలుత నిర్ణయించారు. అయితే, దరఖాస్తు చేసుకున్న అత్యధిక శాతం మంది విద్యార్థులు ప్లస్ టూలో రీటోటలింగ్కు దరఖా స్తు చేశారు. దీంతో రీటోటలింగ్ మార్కుల జాబి తా వైద్య విద్యశాఖకు అందాల్సి ఉంది. దీంతో ముందుగా నిర్ణయించిన మేరకు ర్యాండం నంబర్లను విడుదల చేయలేని పరిస్థితి. శుక్రవారానికి మార్కుల జాబితా అందనుండడంతో శని వారం ర్యాండం నంబర్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ముందుగా నిర్ణయించిన మేరకు 18వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ఆరంభం అవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 18న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రారంభం: ఈ ఏడాది ఇంజనీరింగ్ సీట్ల మీద విద్యార్థులు పెద్దగా మక్కువ చూపలేదు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సుల మీద దృష్టి పెట్టిన వాళ్లు అధికమే. దీంతో ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న కళాశాలలు, ప్రైవేటు కళాశాలల్లో సీట్లకు డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ఆయా కళాశాలల్లో అడ్మిషన్ల పర్వం ముగింపు దశకు చేరింది. బీకాంను ఈ ఏడాది అత్యధిక మంది విద్యార్థులు ఎంపిక చేసుకున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. డిగ్రీ కళాశాలల ప్రారంభం తేదీని బుధవారం ప్రకటించారు. ఈనెల 18 నుంచి ఆయా కళాశాలల గేట్లు తెరచుకోనున్నాయి. బాలాజీకి లక్కు: ఈ ఏడాది కేంద్ర వైద్య విద్యాకౌన్సిల్ మౌళిక వసతుల పేరిట కళాశాలల మీద కొరడా ఝుళిపించే పనిలో పడింది. ఎక్కడ వైద్య కోర్సుల సీట్లు తగ్గుతాయోనన్న ఆందోళన నేపథ్యంలో బాలాజీ వైద్య కళాశాలకు వంద సీట్లు దక్కనున్నాయి. చెన్నైలోని ఈ కళాశాలలో 150 వైద్య కోర్సుల సీట్లు ఉన్నాయి. అదనంగా వంద కేటాయించాలన్న ప్రతిపాదనను ఆ కళాశాల యాజమాన్యం వైద్య విద్యా కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లింది. అయితే, వసతులు లేవంటూ ఆ సీట్ల కేటాయింపునకు కౌన్సిల్ నిరాకరించింది. దీంతో ఆ యాజమాన్యం కోర్టును ఆశ్రయించడంతో వైద్య విద్యా కౌన్సిల్ బుధవారం వివరణ ఇచ్చుకుంది. కళాశాలలో అన్ని రకాల వసతులు ఉన్నట్టుగా నిరూపితం కావడంతో వైద్య విద్యా కౌన్సిల్ ఉత్తర్వులను, వివరణను మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అగ్ని హోత్రి, సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ తిరస్కరించింది. దీంతో ఆ కళాశాలకు అదనంగా వంద సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి.