![Changes In TS EAMCET Counseling Dates - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/31/ENGINEERING-3.jpg.webp?itok=vnLWSBpD)
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌లో సాంకేతిక విద్య శాఖ అధికారులు స్వల్ప మార్పులు చేశారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీలో ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైవారికి అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి తొలివిడత ఎంసెట్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ గడువు సోమవారం, ధ్రువపత్రాల పరిశీలన గడువు మంగళవారం ముగిసింది.
అయితే, తాజాగా మంగళవారమే ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో ఉత్తీర్ణులు ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో స్లాట్ బుకింగ్, ధ్రువపత్రాల పరిశీలన, ఆప్షన్లకు కొత్త తేదీలను ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment