ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటా యని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది.
తుది తీర్పునకు లోబడి నీట్ ఫలితాలు
Published Sat, Jun 10 2017 1:06 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
- ఇంగ్లిష్ మీడియం వారికి తెలుగు ప్రశ్నపత్రంపై వివరణ కోరిన ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటా యని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు తెలుగు మీడియం ప్రశ్నపత్రాలిచ్చిన వ్యవహారంపై వివరాలను తమ ముందుంచాలని సీబీఎస్ ఈ కార్యదర్శి, నీట్–2017 డైరెక్టర్ తదితరు లను ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇంగ్లిష్ మీడియంను ఎంపిక చేసుకున్న తమకు నీట్‌లో తెలుగు ప్రశ్నపత్రం ఇచ్చి, బలవంతంగా తెలుగు లోనే పరీక్ష రాయించారని, తిరిగి పరీక్ష నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ వరంగల్, జనగాం జిల్లాలకు చెందిన ఎం.డి.రీమా నౌషీన్, జావీద్ మరో 5 మంది విద్యార్థులు హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేశారు.
మళ్లీ పరీక్ష నిర్వహించాలి...
పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.రమేశ్ వాదనలు వినిపిస్తూ.. తమకు జరిగిన అన్యా యంపై పిటిషనర్లు నీట్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారని, ఇప్పటికీ స్పందన రాలేదని తెలిపా రు. ఇంగ్లిష్ ప్రశ్నపత్రం ఇచ్చుంటే పిటిషనర్లు సులభంగా 600 మార్కులు సాధించి ఉండే వారన్నారు. కనుక పిటిషనర్లకు తిరిగి పరీక్ష నిర్వహించడంతో పాటు.. వారికి రూ.20 లక్షల చొప్పున పరిహారమిచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అప్పటి వరకు నీట్ ఫలితాలను వెల్లడించకుండా మధ్యం తర ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... నీట్ ఫలితాలు వెల్లడించుకోవచ్చునని, అయితే అవి ఈ వ్యాజ్యాల్లో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయంటూ ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
Advertisement