అలాంటప్పుడు విదేశాల్లో ఎందుకు చదువుతున్నారు.. కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు | Indian Students Who Study MBBS Abroad Fail In NEET | Sakshi
Sakshi News home page

విదేశాల్లో చదువుతున్న వైద్య విద్యార్ధులపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Mar 2 2022 12:51 PM | Updated on Mar 2 2022 12:51 PM

Indian Students Who Study MBBS Abroad Fail In NEET - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్ధులపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప‍్రహ్లాద్‌ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. విదేశాల్లో ఎంబీబీఎస్‌ చేస్తున్న విద్యార్థులపై సంచలన వ్యాఖ‍్యలు చేశారు. 

తాజాగా జోషి మాట్లాడుతూ.. విదేశాల్లో మెడిసిన్‌ విద్యను అభ్యసించిన 90 శాతం భారత విద్యార్థులు ఇండియాలో క్వాలిఫైయింగ్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారని విమర్శించారు. ఉత్తీర్ణత సాధించలేనప్పుడు విదేశాల్లో చదవడం ఎందుకని ప్రశ్నించారు. విదేశాలకు వెళ్లే భారతీయుల్లో 60 శాతం మంది చైనా, రష్యా, ఉక్రెయిన్‌లకు వెళ్తున్నారని తెలిపారు. వీరిలో ఎక్కువ శాతం మంది చైనాలో విద్యను అభ్యసించేందుకే మొగ్గు చూపుతున్నట్టు పేర్కొన్నారు.  కాగా, విదేశాల్లో మెడిసిన్‌ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు స‍్వదేశంలో ప్రాక్టీస్‌ చేయాలంటే ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. పరీక్షలు పాస్‌ అ‍యితేనే వారికి భారత్‌లో ప్రాక్టీస్‌ చేసుకునేందుకు అనుమతి లభిస్తుంది. 

ఇదిలా ఉండగా మంత్రి వ్యాఖ‍్యలపై విద్యార్థులు, ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. దేశంలో మెడికల్‌ కాలేజీలు, సీట్లు తక్కువగా ఉన్నాయని ఆరోపించారు. నీట్‌లో తాము అర్హత సాధించినప్పటికీ సీట్ల సంఖ‍్య తక్కువగా ఉండటంతో తామకు నష్టం జరుగుతోందన్నారు. స్వదేశంలో ఎంబీబీఎస్‌ చదివిన డాక్డర్లు మాత్రం ఉండి ఉంటే దేశంలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉండేదన్నారు. మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై పత్రిపక్ష నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement