సాక్షి, హైదరాబాద్: నీట్ పరీక్ష విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నలు సంధించారు.
కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలను ప్రభావితం చేసే సున్నితమైన, అతి ముఖ్యమైన విషయం నీట్ పరీక్ష. ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది?. స్పష్టంగా పరిష్కరించాల్సిన పెద్ద సమస్య ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రి ఎందుకు కఠినంగా తిరస్కరించారు’ అంటూ కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ జత చేసి ప్రశ్నలు సంధించారు.
అలాగే, నీట్‌పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలన్నారు. 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం అనుమానాలకు తావిస్తోంది. నీట్‌లో అవకతవకలపై ప్రధాని మోదీ మౌనం వీడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Why is the NDA Govt so callous on a such a sensitive & important matter that affects lakhs of students and their families who have taken the NEET examination
Why the stringent denial by the Education Minister when clearly there is a huge problem which needs to be addressed?… https://t.co/LYWjOUkkmz pic.twitter.com/7mRojL3uxG— KTR (@KTRBRS) June 17, 2024
Comments
Please login to add a commentAdd a comment