పదోతరగతి పేపర్ లీకేజీ అంశంపై చర్చకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది.
అమరావతి: పదోతరగతి పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై అసెంబ్లీలో చర్చకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. పేపర్ లీకేజీ అంశంపై మంగళవారం సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది.
వాయిదా తీర్మానంపై చర్చకు స్పీకర్ అంగీకరించక పోవడంతో వైఎస్‌ఆర్ సీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 'లీకేజీ ప్రభుత్వం డౌన్‌డౌన్' అంటూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్ సీపీ సభ్యల ఆందోళనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను నిర్వహించారు. దీంతో స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ సభను స్పీకర్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.