
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంటు వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఎనిమిదో రోజు కూడా పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ 12గంటల వరకు, రాజ్యసభ 2గంటల వరకు వాయిదా పడింది. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతోపాటు పోడియంలోకి దూసుకెళ్లారు.
కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్లుకోవాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. వీరితోపాటు టీడీపీ ఎంపీలు కూడా ఉన్నారు. స్పీకర్ ఎంత వారించినా కేంద్రం నుంచి ప్రకటన రావాల్సిందేనని డిమాండ్ చేయడంతో ఎలాంటి చర్చలు లేకుండానే ప్రారంభమైన కొద్దిసేపటికే రెండు సభలు కూడా వాయిదా పడ్డాయి. ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పిన కేంద్ర ప్రభుత్వాన్ని గత కొద్ది రోజులుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇటు లోక్‌సభలో అటు రాజ్యసభలో నిలదీస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment