న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ పేపర్ లీకేజీ రద్దు చేయాలంటూ పదుల సంఖ్యలో దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం విచారణ /జరిగింది. అయితే నీట్ పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదని, అందుకు బలం చేకూరేలా ఆధారాలతో కేంద్రం, నీట్ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (నీట్)లు సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాయి. అదే సమయంలో కేసులో దర్యాప్తు స్టేటస్‌ను సీబీఐ కోర్టులో సబ్మిట్ చేసింది. ఈ అఫిడవిట్‌లను, సీబీఐ రిపోర్టును పూర్తి స్థాయిలో పరిశీలించాలని అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.
నీట్ పేపర్ లీకేజీపై చర్చ జరిగే సమయంలో.. పరిమిత సంఖ్యలో లీకేజీ జరిగిందని, పేపర్ లీక్ అనే పదాన్ని వినియోగించేందుకు కేంద్రం అంగీకరించడం లేదు. నీట్‌లో మాల్ ప్రాక్టీస్ జరగలేదని కేంద్రం పేర్కొంది. ఈ లీకేజీ బీహార్‌లోని ఓ కేంద్రానికి పరిమితమైందని, పేపర్ సోషల్ మీడియాలో లీకవ్వలేదని చెప్పింది. రీ నీట్ టెస్ట్ అవసరం లేదని వెల్లడించింది. అదే సమయంలో సీబీఐ సైతం సోషల్ మీడియాలో పేపర్ లీక్ కాలేదని.. కేవలం స్థానికంగానే పేపర్ లీక్ అయ్యిందని తన దర్యాప్తు నివేదికను సమర్పించింది.
నీట్ పరీక్ష కోసం 24 లక్షల మంది విద్యార్ధులు భవిష్యత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టడం సరికాదని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. ఇప్పటికే దాఖలైన అఫిడవిట్‌లను పరిశీలించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని భావించిన సుప్రీం కోర్టు విచారణను జులై 18 కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment