నీట్ పేపర్ లీకేజీపై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (సీజేఐ డీవై చంద్రచూడ్) నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తుది తీర్పు మంగళవారం వెల్లడించింది.
అయితే నీట్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి చంద్రచూడ్.. నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషనర్ తరుపు సీనియర్ న్యాయవాది మాథ్యూస్ నెడుంపరపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కోర్టు నుంచి బయటకు వెళ్లిపోవాలి. లేదంటే సెక్యూరిటీని పిలవాల్సి వస్తుందంటూ మండిపడ్డారు. ఇలా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహానికి న్యాయవాది మాథ్యూస్ నెడుంపర వ్యవహారశైలే కారణం.
మాథ్యూస్ నెడుంపర ఏమన్నారు?
అత్యున్నత న్యాయ స్థానంలో నీట్ పిటిషన్లపై విచారణ జరుగుతుంది. పేపర్ లీకేజీ, పరీక్ష రద్దు చేస్తే విద్యార్ధుల భవిష్యత్ పరిణామాలపై సీజేఐ మాట్లాడుతున్నారు. దాఖలైన పిటిషన్లపై పిటిషనర్లకు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
అదే సమయంలో మాథ్యూస్ నెడుంపర మధ్యలో కలగజేసుకున్నారు. కోర్టు హాలులో ఉన్న లాయర్లు అందరికంటే నేనే సీనియర్. బెంచ్ వేసిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. కోర్టులో నేనే అమికస్ (అమికస్ క్యూరీ)అని మాట్లాడగా..
ఇక్కడ నేను ఎవర్ని అమికస్ గా నియమించలేదు అంటూ సీజేఐ స్పందించారు. అందుకు ప్రతిస్పందనగా.. మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతానంటూ సీజేఐ చంద్రుచూడ్ మాటలకు అడ్డు చెప్పారు నెండుపర .
నెడుంపర మాటలకు వెంటనే చంద్రుచూడ్ మాట్లాడుతూ.. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు కోర్టు గ్యాలరీలో మాట్లాడకూదు. సెక్యూరిటీని పిలవండి. నెడుంపరను బయటకు తీసుకెళ్లండి అంటూ గట్టిగా హెచ్చరించారు.
చంద్రుచూడ్ వ్యాఖ్యలకు.. నేను వెళ్తున్నాను.. నేను వెళ్తున్నాను. అంటూ నెడుంపర అక్కడి నుంచి కదిలే ప్రయత్నం చేశారు.
మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్లిపోవచ్చు. నేను గత 24 ఏళ్లుగా న్యాయవ్యవస్థను చూస్తున్నాను. ఈ కోర్టులో న్యాయవాదులు విధి విధానాలను నిర్దేశించడాన్ని నేను అనుమతించలేను అని అన్నారు.
కోర్టు నుంచి హాలు నుంచి బయటకు వెళ్తున్న నెడుంపర ఒక్కసారిగా చంద్రచూడ్ వ్యాఖ్యలకు మరోసారి తిరిగి సమాధానం ఇచ్చారు. నేను 1979 నుండి చూస్తున్నాను అని చెప్పడంతో ఆగ్రహానికి గురైన సీజేఐ చంద్రుచూడ్.. మీ వ్యవహార శైలిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుంది. మీరు ఇతర లాయర్లకు ఆటంకం కలిగించకూడదు అని అన్నారు.
దీంతో నెడుంపర అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్ది సేపటికి మళ్లీ తిరిగి వచ్చారు. నన్ను క్షమించండి. నేనేమీ తప్పు చేయలేదు. నాకు అన్యాయం జరిగింది అని వ్యాఖ్యానించారు. మీ పట్ల అనుచితంగా మాట్లాడినందుకు క్షమించండి అని అన్నారు.
సుప్రీం కోర్టులో నాటకీయ పరిణామాల నడుమ నీట్ పరీక్షను రద్దు చేసేందుకు వీలు లేదని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం తీర్పును వెలువరించింది. అంతేకాదు నీట్ పరీక్ష వ్యవస్థ లోపభూయుష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. రీ ఎగ్జామ్ పెడితే 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని స్పష్టం చేసింది. లబ్ధిపొందిన 155 మందిపైనే చర్యలు తీసుకోవాలని నీట్‌పై సుప్రీం జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
అమికస్ అంటే
చట్టపరమైన సందర్భాలలో అమికస్ లేదా అమికస్ క్యూరీ అని సంబోధిస్తారు. సందర్భాన్ని బట్టి కోర్టులో పలు కేసులు విచారణ జరిగే సమయంలో ఒకే కేసుపై పదుల సంఖ్యలో పిటిషన్ దాఖలైనప్పుడు..పిటిషనర్ల అందరి తరుఫున సీనియర్ లాయర్ కోర్టుకు సమాధానం ఇస్తారు. అలా కోర్టుకు రిప్లయి ఇచ్చే లాయర్లను అమికస్ లేదా అమికస్ క్యూరీగా వ్యవహరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment