గన్¸ఫౌండ్రి , లిబర్టీ: టీఎస్‌పీఎస్సీ నియామక పరీక్షా పత్రాల లీకేజీపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. పేపర్‌లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ, ఆమ్‌ఆద్మీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. లీకేజీ నిర్వాకానికి టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంపై సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి యువతకు భరోసా ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తా మని హెచ్చరించారు. కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయతి్నంచిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో విద్యార్థి నాయకులను గోషామహల్ పోలీస్‌స్టేడియంతో పాటు పలు పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం, గాంధీభవన్ వద్ద గుమికూడిన వ్యక్తులను కూడా ముందస్తుగానే అదుపులోకి తీసు కున్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో టీఎస్‌పీఎస్సీ అధికారులు చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ విద్యార్థి యువజన విభాగం నేతలు రణదీర్‌సింగ్, రాణాతేజ్, రాకేష్సింగ్ మాట్లాడుతూ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా నాలుగు రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment