సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ జరిగి నెలన్నర దాటుతున్నా.. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదని లేదని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. అంగట్లో సరుకులు అమ్ముతున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ బోర్డు క్వశ్చన్ పేపర్లు అమ్మకానికి పెట్టినా కేసీఆర్ సర్కార్‌కు సిగ్గురాదని మండిపడ్డారు.
వెంటనే టీఎస్‌పీఎస్‌సీ బోర్డును ప్రక్షాళన చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. గతంలో నిరుద్యోగుల ఆత్మహత్యల నుంచి నేటి పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల కష్టార్జీతం నీటిపాలైనా దొరకు(సీఎం కేసీఆర్) దున్నపోతు మీద వానపడినట్లే వ్యవహరిస్తున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు.
‘నిరుద్యోగుల పక్షాన గళమెత్తితే పిరికిపందలా, అధికార మదంతో పోలీసులను పంపించి హౌజ్ అరెస్ట్ చేయించడం మాత్రమే కేసీఆర్‌కు చేతనవుతుంది. టీఎస్‌పీఎస్‌సీ స్కాంపై ఎలాంటి చర్యలు లేకుండానే పరీక్షలు నిర్వహించి, మళ్లీ క్వశ్వన్ పేపర్లు అమ్మి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా ఉన్నట్లుంది. నిరుద్యోగుల మీద సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించి, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు.
చదవండి: బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ఘటన.. డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష
Comments
Please login to add a commentAdd a comment