సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీబీఎస్‌ఈ అకౌంటన్సీ ప్రశ్నాపత్రం లీకైంది. గురువారం జరగాల్సిన 12 వ తరగతి అకౌంటెన్సీ పరీక్ష ప్రశ్నాపత్రం నిన్న( బుధవారం) సాయంత్రమే సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. ఆ తర్వాత వెంటనే వాట్సాప్‌లో షేర్ అవ్వడంతో పేపర్ లీక్ విషయాన్ని సీబీఎస్‌ఈ గుర్తించింది. అకౌంటెన్సీ ప్రశ్నాపత్రం రెండో సెట్‌తో లీకైన పేపర్ మ్యాచ్ అయినట్టు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో మొదట పేపర్ లీక్ అయిన్టటు తెలిపారు.
మరోవైపు పేపర్ లీకేజీపై ఆ రాష్ట్ర విద్యామంత్రి మనీశ్ సిసోడియా స్పందించారు. ‘ అకౌంటెన్సీ పేపర్ లీకైనట్టు నాకు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేయాలని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధికారులను ఆదేశించాను. సీబీఎస్‌ఈ నిర్లక్ష్యం వల్ల కష్టపడి చదివే విద్యార్థులు నష్టపోకూడదు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment