CBSE Class XII
-
మరోసారి వార్తల్లో నిలిచిన సివిల్స్ టాపర్ టీనా దాబీ.. మార్క్‌షీట్ వైరల్
యూపీఎస్సీ టాపర్, ఐఏఎస్ అధికారి టీనా దాబీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె సీబీఎస్ఈ 12వ తరగతి మార్క్‌షీట్ సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం టీనాకు హిస్టరీ, పాలిటికల్ సైన్స్‌లో 100కు 100 మార్కులు వచ్చినట్లు కొన్ని మీడియా సంస్థలు చెప్పాయి. అయితే ఈ మార్క్‌షీట్ నిజంగా టీనాదేనా అనే విషయంపై క్లారిటీ లేదు. ఆమెకు రెండు సబ్జెక్టుల్లో 100 మార్కులు రావడాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. అసలు టీనా మార్క్‌షీట్ నెట్టింట్లో లేదని తెలుస్తోంది. అయితే టీనా 2011 సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో 93శాతం మార్కులు సాధించినట్లు సమాచారం. ఢిల్లీలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ స్కూల్లో చదివిన ఆమె.. టాపర్‌గా నిలిచింది. ఢిల్లీ యూనివర్సిటీ లేడీ శ్రీరాం కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో బీఏ పూర్తి చేసింది. తన ప్రతిభకు గానూ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు కూడా అందుకుంది. 2015 యూపీఎస్సీ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో జైసల్మేర్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తోంది. తరచూ వార్తల్లో టీనా సివిల్స్‌లో టాపర్ అయినప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తోంది. 22 ఏళ్లకే ఐఏఎస్ అయిన దళిత యువతిగా అరుదైన ఘనత సాధించింది. అయితే సివిల్స్ రెండో ర్యాంకర్ అయిన అథర్ అమీర్ ఖాన్‌తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించడం పెద్ద చర్చకు దారితీసింది. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా వెనక్కి తగ్గకుండా 2018లో వీళ్లిద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ 2020లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత డాక్టర్ ప్రదీప్ గవాండేను(2013 ఐఏఎస్ బ్యాచ్)ను రెండో వివాహం చేసుకుంది టీనా. దాదాపు ఏడాదిపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట పెళ్లి 2022లో జరిగింది. ఇది కూడా ప్రేమ వివాహమే కావడం గమనార్హం. చదవండి: జర భద్రం..! ఆ దేశానికి వెళ్లే వారికి కేంద్రం హెచ్చరిక -
CBSE 12th board Exams 2021: జూన్ 1లోగా నిర్ణయం
న్యూఢిల్లీ: కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో.. సీబీఎస్ఈ క్లాస్ 12 పరీక్షల నిర్వహణపై జూన్ 1వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది. పరీక్షల నిర్వహణపై రాష్ట్రాల్లో కొంతవరకు ఏకాభిప్రాయం వ్యక్తమైందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ తెలిపారు. రాష్ట్రాలు తమ అభిప్రాయాలు, సూచనలను సమగ్రంగా మే 25 లోగా తమకు పంపించాలని కోరారు. క్లాస్ 12 పరీక్షల నిర్వహణపై ఆదివారం కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రాలు తమ అభిప్రాయాలను ఈ సమావేశంలో వ్యక్తం చేశాయి. పరీక్షలు నిర్వహించకూడదనే ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని మహారాష్ట్ర, పరీక్షలకు ముందే విద్యార్థులకు వ్యాక్సినేషన్ చేయాలని ఢిల్లీ, కేరళ సూచించాయి. మరోవైపు, జూలై 15 నుంచి ఆగస్ట్ 26 మధ్య పరీక్షలు నిర్వహించి, సెప్టెంబర్‌లో ఫలితాలను విడుదల చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సూచించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి సీబీఎఎస్‌ఈ రెండు ప్రతిపాదనలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అవి 1) కొన్ని ఎంపిక చేసిన కేంద్రాల్లో మొత్తం 19 మేజర్ సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించాలి. మైనర్ సబ్జెక్టుల ఫలితాలను మేజర్ సబ్జెక్టుల్లో ఫలితాల ఆధారంగా నిర్ణయించాలి. మూడునెలల్లో మొత్తం ప్రక్రియను ముగించాలి. తొలినెలలో ప్రీ ఎగ్జామ్ యాక్టివిటీ, రెండోనెలలో పరీక్షలు, మూడోనెలలో ఫలితాలు వెల్లడించాలి. 2) మూడు గంటలు కాకుండా, గంటన్నర పాటే, వారి పాఠశాలలోనే పరీక్షలు జరపాలి. పరిస్థితిని బట్టి రెండుసార్లు పరీక్షలను నిర్వహించవచ్చు. జూలై 15 నుంచి ఆగస్ట్ 1 మధ్య ఫస్ట్ ఫేజ్, ఆగస్ట్ 8–26 మధ్య సెకండ్ ఫేజ్ పరీక్షలను నిర్వహించవచ్చు. కరోనా కారణంగా ఏ విద్యార్థి అయినా పరీక్ష రాయలేనట్లయితే.. ఆ విద్యార్థికి మరో అవకాశం ఇవ్వాలి. ఆబ్జెక్టివ్, షార్ట్ ఆన్సర్ తరహాలో ప్రశ్నపత్రం ఉండాలి. ఒక లాంగ్వేజ్, మూడు ఎలెక్టివ్ సబ్జెక్టుల్లో విద్యార్థి పరీక్ష రాయాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయం సీబీఎస్ఈ మొదటి ప్రతిపాదనను కొన్ని రాష్ట్రాలు, రెండో ప్రతిపాదనను మెజారిటీ రాష్ట్రాలు సమర్ధించినట్లు సమాచారం. 10వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ ఇప్పటికే రద్దు చేసింది. ఏప్రిల్–మేలో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్ కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. సమావేశం ఫలవంతంగా జరిగిందని, రాష్ట్రాల నుంచి విలువైన సూచనలు అందాయని రమేశ్ పోఖ్రియాల్ పేర్కొన్నారు. ‘సలహాలు, సూచనలతో సమగ్ర నివేదికను మే 25లోపు పంపించాలని రాష్ట్రాలను కోరాం. ఆ తరువాత సాధ్యమైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకుని, అనిశ్చితికి తెరవేస్తాం’ అని వెల్లడించారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ప్రకాశ్ జవదేకర్, సంజయ్ ధాత్రే, పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులు ఈ వర్చువల్ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్ కూడా గట్టిగా వినిపిస్తోంది. ‘క్యాన్సిల్‌బోర్డ్‌ఎగ్జామ్స్’ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉంది. పరీక్షల నిర్వహణకు తాము వ్యతిరేకమని, టీకాలు వేయకుండా విద్యార్థులను పరీక్షలు రాయమనడం పెద్ద పొరపాటవుతుందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 1.5 కోట్ల మంది క్లాస్ 12 విద్యార్థులున్నారని, వారిలో 90% 17 ఏళ్లు పైబడినవారేనని ఆయన వివరించారు. వారికి కోవిడ్ టీకా ఇవ్వడానికి వీలవుతుందేమో నిపుణులతో చర్చించాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు సుముఖమే కానీ, కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తరువాత పరీక్షలు జరిపితే మంచిదని భావిస్తున్నట్లు తమిళనాడు పేర్కొంది. ఈ పరీక్షలు విద్యార్థుల కెరీర్‌కు ఎంతో ముఖ్యమంది. -
CBSE Exams 2021: జులైలో సీబీఎస్ఈ పరీక్షలు?
న్యూఢిల్లీ: బోర్డు పరీక్షలు జరిపేందుకే మొగ్గు చూపుతోంది సీబీఎస్ఈ. ఇందుకు సంబంధించి రెండు విధి విధానాలను పరిశీలిస్తోంది. ఆ వివరాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సీఈఎస్ఈ తెలియజేసింది. అయితే దీనిపై ఇంకా కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. సెకండ్‌వేవ్ విజృంభణతో ఈ పరీక్షలు వాయిదా వేస్తారని ప్రచారం జరిగింది. అయితే పరీక్షల నిర్వాహణకే సీబీఎస్ఈ మొగ్గు చూపింది. మూడు నెలల్లో 12 తరగతి పరీక్షలు నిర్వహించేందుకు రెండు పద్దతులను కేంద్రం ముందు ఉంచింది సీబీఎస్ఈ. ఇందులో మొదటి పద్దతి ప్రకారం పరీక్షల ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి నెలలో ప్రీ ఎగ్జామ్స్ యాక్టివిటీస్, రెండో నెలలో పరీక్షల నిర్వహించడం, మూడో నెలలో ఫలితాలు వెల్లడి వంటివి ఉంటాయి. అయితే పరీక్షలు ప్రధాన సబ్జెక్టులకే నిర్వహిస్తారు. ఇందులో వచ్చే మార్కుల ఆధారంగా మిగిలిన సబ్జెక్టుల్లో మార్కులు కేటాయిస్తారు. దీని ప్రకారం జూన్‌లో పరీక్షా తేదీలను ప్రకటించి జులైలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. నాలుగు సబ్జెక్టులే ఇక రెండో ఆప్షన్ ప్రకారం పరీక్షా సమయాన్ని కేవలం 90 నిమిషాలకు కుదించి 4 సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఒకటి కచ్చితంగా భాషకు సంబంధించి అయి ఉండాలి. మిగిలిన మూడు సబ్జెక్టులను విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చు. మొత్తంగా విద్యార్థులు నాలుగు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇందులో వచ్చే మార్కుల ఆధారంగా మిగిలిన రెండు సబ్జెక్టులకు మార్కులు కేటాయిస్తారు. -
CBSE: ‘అలా చేస్తే విద్యార్థులకు అన్యాయం చేసినట్లే’
సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేయడం సరికాదంటూ టోనీ జోసెఫ్ అనే ఉపాధ్యాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేయడం వల్ల కష్టపడి చదివే విద్యార్థులకు అన్యాయం చేసినట్లు అవుతుందని టోనీ తరఫు న్యాయవాది జోస్ అబ్రహం ఈ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది మమతా శర్మ దాఖలు చేసిన పిటిషన్లో ఇంప్లీడ్ అవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. ‘‘12వ తరగతి పరీక్షలు అనేవి విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకం. ఉన్నత విద్యలో చేరడానికి ఈ పరీక్షా ఫలితాలు ఎంతో ముఖ్యం. ఈ పరీక్షలను రద్దు చేస్తే కష్టపడి చదివే విద్యార్థులకు అన్యాయం చేసినట్లే. ఇంటర్నల్ అసెస్ మెంట్, విద్యా సంస్థలు నిర్వహించే ఆన్లైన్ పరీక్షలు ఆధారంగా ఉత్తీర్ణత చేయడం అన్యాయం. ఇంటర్నల్ పరీక్షలు అన్నీ కూడా ఇంట్లో కూర్చొనే విద్యార్థులు రాశారు’’ అని పిటిషన్లో పేర్కొన్నారు. కోవిడ్–19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా పరీక్షలు వాయిదా వేశారని, జూన్ 1న పరిస్థితిని సమీక్షిస్తామని సీబీఎస్ఈ పేర్కొందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చదవండి: ఈ పోటీలో గెలిస్తే రూ.50 వేలు మీ సొంతం? కొవిడ్‌తో అనాథలైన పిల్లలకు ప్రతి నెల రూ.2500 -
సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు, 12వ తరగతి ఎగ్జామ్స్ వాయిదా
-
CBSE పదో తరగతి పరీక్షలు రద్దు
ఢిల్లీ: సెకండ్ వేవ్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల ప్రతిభ, పనితీరు ఆధారంగా వారికి మార్కులు కేటాయిస్తామని వెల్లడించింది. 12వ తరగతి పరీక్షలు మాత్రం వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. "దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత, విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మే 4 నుంచి జూన్ 7 వరకు జరగాల్సిన సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నాం. బోర్డు తయారు చేసే ఆబ్జెక్టివ్, క్రైటీరియా ఆధారంగా విద్యార్థుల పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తాం. ప్రస్తుతానికి 12వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నాం. జూన్ 1న పరిస్థితిని సమీక్షించిన తర్వాత 12వ తరగతి ఎగ్జామ్స్‌పై నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ పరీక్షలు పెట్టాలనుకుంటే 15 రోజుల ముందుగానే వాటి వివరాలు ప్రకటిస్తాం" అని తెలిపారు. కోరలు చాస్తున్న కరోనాను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. విద్యార్థుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని మోదీ చెప్పారని ఈ భేటీకి హాజరైన విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. అనంతరం టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని వివరాల కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ cbse.nic.inను వీక్షించండి. చదవండి: ఈ ఏడాదే సీబీఎస్ఈ సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల -
సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క సెంట్రల్ బోర్డ్(సీబీఎస్ఈ) 10, 12వ తరగతులకు సంబందించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2020-2021 విద్యా సంవత్సారానికి సంబంధించి 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ ఫోక్రియాల్ నిషాంక్ నేడు ట్విటర్లో ప్రకటించారు. ఈ పరీక్షలు మే 4 నుంచి జూన్ 10 వరకు జరగనున్నాయి.(చదవండి: ఆధార్ సేవా కేంద్రాల కోసం హెల్ప్‌లైన్) షెడ్యూల్: మే 4 నుంచి జూన్ 7 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి మే 4 నుంచి జూన్ 11 వరకు 12వ తరగతి పరీక్షలు జరగనున్నాయి మార్చి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జులై 15 తేదీలోగా సీబీఎస్ఈ ఫలితాలు విడుదల పదో తరగతి పరీక్షలు రోజూ ఉదయం 10.30గం నుంచి మధ్యాహ్నం 1.30గం వరకు కొనసాగనున్నాయి. అలాగే, 12వ తరగతి పరీక్షలు రెండు షిఫ్ట్‌లలో నిర్వహించనున్నారు. తొలి షిఫ్ట్ ఉదయం 10.30గం నుంచి 1.30గం వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30గం నుంచి 5.30గం వరకు నిర్వహిస్తారు. మహమ్మారి కారణంగా10, 12 తరగతుల సిలబస్‌ను 30 శాతం తగ్గించారు. కోవిడ్-19 పాండమిక్ ప్రోటోకాల్స్‌ను అనుసరించి పరీక్షలు జరుగుతాయి. ఫేస్ మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. మరిన్ని వివరాల కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ cbse.nic.inను వీక్షించండి. -
కెమిస్ట్రీలో 24 మార్కులే.. ఐఏఎస్ ట్వీట్ వైరల్
గాంధీనగర్: ‘మార్కులే జీవితం కాదు.. వందేళ్ల నీ జీవితాన్ని వంద మార్కులు నిర్ణయించలేవు’ వంటి మాటలు చాలాసార్లు వినే ఉంటాం. కానీ వాస్తవంగా పరిస్థితులు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. సమాజంలో దాదాపు 99శాతం ప్రజలు మార్కుల ఆధారంగానే పిల్లల తెలివితేటలను, జీవితాన్ని అంచాన వేస్తారు. బాగా చదివే పిల్లలతో పోల్చి తిడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఓ ఐఏఎస్ అధికారి చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. సాధారణంగా ఐఏఎస్ అయ్యాడంటే చాలా తెలివితేటలు.. చదువులో టాప్ అనే భావం మనలో చాలా మందికి ఉంటుంది. కానీ ఈ ఐఏఎస్‌ను చూస్తే ఆ ఆలోచనలన్ని పటాపంచలవుతాయి. ఎందుకంటే ఈ అధికారి ఇంటర్ రసాయన శాస్త్రంలో కేవలం 24 మార్కులు తెచ్చుకుని జస్ట్ పాసయ్యాడు అంతే. అమ్దావాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, అహ్మదాబాద్ స్మార్ట్ సిటీ సీఈఓగా విధులు నిర్వహిస్తున్న నితిన్ సంగ్వాన్ తన సీబీఎస్ఈ ఇంటర్ మార్క్స్ మెమోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ‘సీబీఎస్ఈ ఇంటర్ పరీక్షల్లో నాకు కెమిస్ట్రీలో 24 మార్కులే వచ్చాయి. పాస్ మార్కుల కంటే ఒక్క మార్కు ఎక్కువ వచ్చింది. అయితే నా జీవితంలో నేను ఏం కావాలనుకుంటున్నానో ఈ మార్కులు నిర్ణయించలేదు. అందుకే మార్కుల భారాన్ని పిల్లల మీద మోపి వారిని బాధ పెట్టకండి. బోర్డు ఫలితాల కంటే జీవితం చాలా విలువైనది. రిజల్ట్ అనేది ఆత్మపరిశీలనకు అవకాశంగా భావించండి.. విమర్శించడానికి కాదు’ అంటూ ట్వీట్ చేశారు నితిన్. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. In my 12th exams, I got 24 marks in Chemistry - just 1 mark above passing marks. But that didn't decide what I wanted from my life Don't bog down kids with burden of marks Life is much more than board results Let results be an opportunity for introspection & not for criticism pic.twitter.com/wPNoh9A616 — Nitin Sangwan, IAS (@nitinsangwan) July 13, 2020 -
తండ్రి జైల్లో.. కూతురు టాపర్!
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు షబ్బీర్ అహ్మద్ షా కూతురు తాజాగా విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో టాపర్‌గా నిలిచారు. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న కేసులో షబ్బీర్ అహ్మద్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. ఆయన కూతురు సమా శ్రీనగర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు. తాజా ఫలితాల్లో 97.8శాతం మార్కులు సాధించిన ఆమె జమ్మూకశ్మీర్ రాష్ట్రం వరకు సీబీఎస్ఈ పరీక్షల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. జమ్మూకశ్మీర్ డెమొక్రటిక్ ఫ్రీడమ్ పార్టీ నేత అయిన షబ్బీర్ అహ్మద్ షాను ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న కేసులో 2017 జూలై 26న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. టాపర్‌గా నిలిచిన సమాను ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అభినందించారు. -
సీబీఎస్ఈ ప్రశ్నాపత్రం లీక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీబీఎస్ఈ అకౌంటన్సీ ప్రశ్నాపత్రం లీకైంది. గురువారం జరగాల్సిన 12 వ తరగతి అకౌంటెన్సీ పరీక్ష ప్రశ్నాపత్రం నిన్న( బుధవారం) సాయంత్రమే సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. ఆ తర్వాత వెంటనే వాట్సాప్‌లో షేర్ అవ్వడంతో పేపర్ లీక్ విషయాన్ని సీబీఎస్ఈ గుర్తించింది. అకౌంటెన్సీ ప్రశ్నాపత్రం రెండో సెట్‌తో లీకైన పేపర్ మ్యాచ్ అయినట్టు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో మొదట పేపర్ లీక్ అయిన్టటు తెలిపారు. మరోవైపు పేపర్ లీకేజీపై ఆ రాష్ట్ర విద్యామంత్రి మనీశ్ సిసోడియా స్పందించారు. ‘ అకౌంటెన్సీ పేపర్ లీకైనట్టు నాకు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేయాలని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధికారులను ఆదేశించాను. సీబీఎస్ఈ నిర్లక్ష్యం వల్ల కష్టపడి చదివే విద్యార్థులు నష్టపోకూడదు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన ట్వీట్ చేశారు. -
సీబీఎస్ఈలోనూ అమ్మాయిలదే హవా
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మొత్తం 82 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఉత్తీర్ణతలో బాలుర కంటే బాలికలు పైచేయి సాధించారు. బాలికలు 87.57 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 77.77 శాతం ఉత్తీర్ణత సాధించారు. 95.41 శాతం ఉత్తీర్ణత తిరువనంతపురం రీజియన్ రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది 1,040,368 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 1.2 శాతం ఎక్కవ.