శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు షబ్బీర్ అహ్మద్ షా కూతురు తాజాగా విడుదలైన సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో టాపర్‌గా నిలిచారు. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న కేసులో షబ్బీర్ అహ్మద్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. ఆయన కూతురు సమా శ్రీనగర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నారు. తాజా ఫలితాల్లో 97.8శాతం మార్కులు సాధించిన ఆమె జమ్మూకశ్మీర్ రాష్ట్రం వరకు సీబీఎస్‌ఈ పరీక్షల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచారు.
జమ్మూకశ్మీర్ డెమొక్రటిక్ ఫ్రీడమ్ పార్టీ నేత అయిన షబ్బీర్ అహ్మద్ షాను ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న కేసులో 2017 జూలై 26న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. టాపర్‌గా నిలిచిన సమాను ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment