separatist leader
-
వేర్పాటువాద నాయకుడు గిలానీ మృతి, సంతాపదినంగా ప్రకటించిన పాక్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, నిషే ధిత జమాత్-ఈ-ఇస్లామీ సభ్యుడు, హురియత్ కాన్ఫరెన్స్ మాజీ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ(92) మృతి చెందారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీనగర్‌లో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న గిలానీ గత ఏడాది రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2008 నుంచి కూడా గిలానీ గృహనిర్బంధంలో ఉన్నారు. హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ పదవికి గతేడాది ఆయన రాజీనామా చేశారు. మొదట ఆయన జమాతే ఈ ఇస్లామి కశ్మీర్ సభ్యుడిగా ఉన్నారు. మరోవైపు గిలానీ మృతిపట్ల పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. కశ్మీర్లో భద్రత కట్టుదిట్టం గిలానీ మరణంతో కశ్మీర్ లోయలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించడంతోపాటు మొబైల్ సేవలను కూడా నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా శ్రీనగర్, ఇతర ప్రధాన నగరాల్లో భద్రతా దళాలను మోహరించాలని అధికారులు ఆదేశించారు. వాహనాల రాకపోకలకు అనుమతి లేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు గిలానీ మృతిపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ట్విటర్ ద్వారా సంతాపం ప్రకటించారు. అంతేకాదు ప్రజల కోసం తన జీవితాన్ని ధారపోసిన గిలానీని భారత ప్రభుత్వం వేదించిందని ఆరోపించారు. ఆయనకు నివాళిగా ఈ రోజు పాక్ జెండాను అవనతం చేసి, అధికారిక సంతాప దినంగా పాటిస్తామని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. Saddened by the news of Geelani sahab’s passing away. We may not have agreed on most things but I respect him for his steadfastness & standing by his beliefs. May Allah Ta’aala grant him jannat & condolences to his family & well wishers. — Mehbooba Mufti (@MehboobaMufti) September 1, 2021 We in Pakistan salute his courageous struggle & remember his words: "Hum Pakistani hain aur Pakistan Humara hai". The Pakistan flag will fly at half mast and we will observe a day of official mourning. — Imran Khan (@ImranKhanPTI) September 1, 2021 -
తండ్రి జైల్లో.. కూతురు టాపర్!
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు షబ్బీర్ అహ్మద్ షా కూతురు తాజాగా విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో టాపర్‌గా నిలిచారు. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న కేసులో షబ్బీర్ అహ్మద్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. ఆయన కూతురు సమా శ్రీనగర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు. తాజా ఫలితాల్లో 97.8శాతం మార్కులు సాధించిన ఆమె జమ్మూకశ్మీర్ రాష్ట్రం వరకు సీబీఎస్ఈ పరీక్షల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. జమ్మూకశ్మీర్ డెమొక్రటిక్ ఫ్రీడమ్ పార్టీ నేత అయిన షబ్బీర్ అహ్మద్ షాను ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న కేసులో 2017 జూలై 26న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. టాపర్‌గా నిలిచిన సమాను ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అభినందించారు. -
ధీర వనితల మధ్య ఎవరామె?
సాక్షి, శ్రీనగర్ : ఆడపిల్లల మనుగడ, రక్షణ మరియు సాధికారత నిర్ధారించడానికి.. సమన్వయం అభిసరణ ప్రయత్నాలు అవసరం ఉందని భావించిన ప్రభుత్వం బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఎంపిక చేసిన సుమారు 100కు పైగా జిల్లాల్లో వీటిపై విస్తృతంగా కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఈ కార్యక్రమం కోసం వెలసిన ఓ ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. కశ్మీర్ వేర్పాటు వాద నేత అషియా అంద్రబి ఫోటోను బ్యానర్లో పొందుపరచటంతో అధికారులపై విమర్శలు వినిపిస్తున్నాయి. కోకర్నాగ్ పట్టణంలో ఈ ఫ్లెక్సీని అధికారులు కట్టారు. ఇందులో ప్రధాని ఇందిరాగాంధీ, మదర్ థెరిస్సా, కల్పనా చావ్లా, సానియా మీర్జా, కిరణ్ బేడీ తదితరులతోపాటు జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే అందులో అంద్రబి ఫోటో కూడా ఉంది. ప్రభావవంతమైన మహిళల ఫోటోల నడుమ ఆమె ఫోటో ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దక్తరన్-ఇ-మిలాత్ చీఫ్ అయిన అంద్రబి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. కశ్మీర్ వేర్పాటు వాద నాయకురాలిగా ఆమెపై పలు కేసులు నమోదు అయ్యాయి. పాక్ ముఖ్యదినాల్లో ఆ దేశ జెండాను మన దగ్గర ఎగరవేసిందన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ఫ్లెక్సీలో ఆమె ఫోటో వ్యవహారంపై బీజేపీ అధికార ప్రతినిధి సునీల్ సెథీ స్పందించారు. ఇప్పటికే ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయగా.. దర్యాప్తనకు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. -
మసరత్ ఆలమ్ అరెస్టు
-
వేర్పాటువాద నేత మస్రత్ ఆలం అరెస్టు
శ్రీనగర్: వేర్పాటువాద నేత మస్రత్ అలంను కశ్మీర్ ప్రభుత్వం శుక్రవారం మరోసారి అరెస్టు చేసింది. శ్రీనగర్‌లో ఆలంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన సందర్భంగా జరిగిన ర్యాలీలో మస్రత్ అలం పాక్ జెండాను ఊపుతూ, ఆ దేశానికి అనుకూలంగా నినాదాలుచేయడాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఆలం అరెస్టుకు జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం అలంను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు ఇలాంటి వ్యక్తుల పట్ల ఎలా వ్యవహరించాలో తమకు బాగా తెలుసనీ, ఉపేక్షించే ప్రశ్నే లేదని, పరిస్థితిని కేంద్రం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని జితేంద్ర సింగ్ వెల్లడించారు. కాగా సైన్యం అదుపులో ఉన్న యువకుని మరణానికి నిరసనగా శుక్రవారం ర్యాలీకి సన్నద్దమవుతున్నారనే వార్తలతో గురువారం అలం, సయ్యద్ అలీషా గిలానీలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. ఇటీవల వేర్పాటువాద నేత మస్రత్ జైలు నుంచి విడుదలైనపుడు భారీ ర్యాలీతో స్వాగతం చెప్పారు. ఈ ర్యాలీలో పాకిస్తాన్ జెండాను ప్రదర్శిస్తూ.. పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో వివాదం రగిలిన సంగతి తెలిసిందే. కశ్మీర్లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మస్రత్ అలీ విడుదలపై గుర్రుగా ఉన్నబీజేపీ ఈర్యాలీ ఉదంతంపై మరింత మండిపడింది. -
'అలంను అందుకే విడుదల చేశాం'
కాశ్మీర్: వేర్పాటు వాది మసారత్ అలంను నిర్భందించి ఉంచడానికి తమ ప్రభుత్వానికి ఎలాంటి కారణాలు కనిపించలేదని కాశ్మీర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకే అతడిని విడుదల చేశామని ప్రకటించింది. వేర్పాటు వాది మసారత్ అలం విడుదలపై కేంద్ర హోంశాఖ రాసిన లేఖకు కాశ్మీర్ ప్రభుత్వం గురువారం పైవిధంగా స్పందించింది. వేర్పాటు వాది మసారత్ అలం విడుదలపై పార్లమెంట్ ఉభయ సభలను ప్రతిపక్షాలు స్తంభింపచేశాయి. అలం విడుదలపై వెంటనే జవాబు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కాశ్మీర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దాంతో కాశ్మీర్ ప్రభుత్వం పైవిధంగా స్పందించింది. ఇటీవలే కాశ్మీర్లో బీజేపీ మద్దతుతో పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పీడీపీకి చెందిన ముఫ్తీ మహమద్ సయిద్ కాశ్మీర్ సీఎంగా పాలన పగ్గాలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో ఎన్నికలు శాంతయుతంగా జరిగాయంటే అందుకు కారణం తీవ్రవాదులు, పొరుగు దేశమైన పాకిస్థాన్ అంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
కశ్మీర్ వేర్పాటువాద నేత విడుదల
శ్రీనగర్: కశ్మీర్ అతివాద నాయకుడు, వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్ నేత మస్రత్ ఆలమ్(44)ను శనివారం రాత్రి ఆ రాష్ట్ర ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. బారాముల్లా జైలు నుంచి విడుదలైన ఆయనను షహీద్ గంజ్ పోలీసుస్టేషన్లో కుటుంబసభ్యులకు అప్పగించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ రాష్ట్ర నూతనముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ నిర్ణయం తీసుకోవడంతో మస్రత్ కూడా విడుదలయ్యారు. మస్రత్ రాజకీయ ఖైదీగానే అరెస్టయినా, తర్వాత ఆయనపై అనేక అభియోగాలు నమోదయ్యాయి. హురియత్ నేత సయీద్ అలీ షా గిలానీకి ఆంతరంగికుడైన ఆలమ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2008-2010 మధ్య పెద్ద ఎత్తున ర్యాలీలు, రాళ్లదాడులు చేసేలా కీలకపాత్ర పోషించాడని, దేశంపై యుద్ధం ప్రకటించాడని కేసులు నమోదయ్యాయి. ఆయన అరెస్టుకు తోడ్పడే సమాచారం ఇచ్చినవారికి రూ. 10 లక్షల రివార్డును ప్రకటించారు. 2010లో అతడు అరెస్టయ్యాడు. కాగా, సీఎం ఆదేశాలపై.. క్రిమినల్ అభియోగాలు లేని రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేస్తామని డీజీపీ రాజేంద్ర చెప్పారు. మస్రత్ ప్రమేయమున్న దాడుల్లో పలువురు మరణించడాన్ని ప్రస్తావించగా.. త్వరలోనే వివరణ ఇస్తామని డీజీపీ తెలిపారు.