
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రాలు లీక్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతకుముందు కర్ణాటక ఎన్నికల తేదీని బీజేపీ నాయకుడు ఒకరు లీక్ చేయడం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలీటీకా అనే సంస్థకు చేరవేస్తున్నాయనే వార్తాలు రాజకీయంగా పెను దూమారాన్నే స్పష్టించాయి. ఈ లీకులపై స్పందించిన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, పరోక్షంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ.. ‘వీక్ చౌకీదార్’ అని వ్యాఖ్యానించారు.
చౌకీదార్ వీక్‌గా ఉండటమే ఈ లీకులకు కారణమని రాహుల్ మండిపడ్డారు. ఇప్పటివరకు డేటా లీక్, ఆధార్ లీక్, ఎస్‌ఎస్‌సీ పరీక్ష లీక్, ఎన్నికల తేదీ లీక్, ఇప్పుడు సీబీఎస్‌ఈ లీక్ అంటూ రాహుల్ ట్విటర్‌లో ఎద్దేవా చేశారు. ఇదే విషయంపై ఇతర కాంగ్రెస్ నాయకులు జ్యోతిరాదిత్య సింథియా, కపిల్ సిబల్ కూడా కేంద్ర ప్రభుత్వంపై ట్వీట్లతో దాడి చేశారు.
कितने लीक?
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2018
डेटा लीक !
आधार लीक !
SSC Exam लीक !
Election Date लीक !
CBSE पेपर्स लीक !
हर चीज में लीक है
चौकीदार वीक है#BasEkAurSaal
Comments
Please login to add a commentAdd a comment