‘ఎంసెట్-2’లో మరో ఇద్దరు అరెస్ట్ | two more arrested in eamcet 2 paper leak case | Sakshi
Sakshi News home page

‘ఎంసెట్-2’లో మరో ఇద్దరు అరెస్ట్

Published Sat, Aug 13 2016 2:54 AM | Last Updated on Sat, Sep 29 2018 6:18 PM

two more arrested in eamcet 2 paper leak case

బ్రోకర్లు మయాంక్, వీరేందర్‌ను అరెస్ట్ చేసిన సీఐడీ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో మరో ఇద్దరు బ్రోకర్లు అరెస్టయ్యారు. కృష్ణా జిల్లాకు చెందిన గరిమెళ్ల వీరేందర్‌రావు అలియాస్ వీరేందర్, కోల్‌కతాకు చెందిన మయాంక్‌ను అరెస్ట్ చేసినట్టు సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మయాంక్ తనను సంప్రదించిన సబ్ బ్రోకర్ల ద్వారా 8 మంది విద్యార్థులను ముంబై తీసుకెళ్లి ఎంసెట్-2కు సంబంధించిన రెండు సెట్ల ప్రశ్నపత్రాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. అలాగే వీరేందర్ ఇద్దరు విద్యార్థులను బెంగళూరు కేంద్రంగా నిర్వహించిన క్యాంపులో ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ మేరకు ఇద్దరు బ్రోకర్లను అరెస్టు చేసినట్లు సౌమ్యామిశ్రా వెల్లడించారు. ఈ కుంభకోణంలో మరికొందరి పాత్ర, కేంద్రబిందువుగా ఉన్న వారి జాడ తెలియాల్సి ఉన్నట్లు సీఐడీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement