ఖమ్మంలో జరిగింది టెన్త్ ఇంగ్లీష్ పేపర్ లీక్ కాదని కలెక్టర్ లోకేష్‌కుమార్ ప్రకటించారు.
ఖమ్మం: ఖమ్మంలో జరిగింది టెన్త్ ఇంగ్లీష్ పేపర్ లీక్ కాదని కలెక్టర్ లోకేష్‌కుమార్ ప్రకటించారు. అక్కడ జరిగింది మాల్ ప్రాక్టీసు మాత్రమే కాబట్టి పరీక్ష మళ్లీ నిర‍్వహించాల్సిన అవసరం లేదని తెలిపారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కోరారు.
పరీక్షల సందర్భంగా ఎటువంటి ఇబ్బంది జరుగకుండా చూస్తామన్నారు. ఏడాదంతా కష్టపడి చదువుకున్న విద్యార్థులకు ఇబ్బంది కలుగ కుండా మీడియా వ్యవహరించాలని కలెక్టర్ కోరారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడి, పేపర్ లీకేజి అంటూ పుకార్లు పుట్టించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని పోలీస్ కమిషనర్ షానవాజ్ కాసీం తెలిపారు.