
అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ్ హీరోలుగా నటాషాదోషి ప్రధాన పాత్ర పోషించిన కొత్త చిత్రం 'యస్. ఐ. టి'. ఎస్ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా థియేటర్‌లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) పేరుతో జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
యంగ్ ఇండియా సినిమాతో హీరోగా పరిచయమైన అరవింద్ కృష్ణ ఇప్పటికే ఇట్స్ మై లవ్ స్టోరీ, రుషి వంటి చిన్న చిత్రాల్లో మెప్పించాడు. రవితేజ రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో కూడా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో మెరిశాడు. తాజాగా 'యస్. ఐ. టి' (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) చిత్రం ద్వారా వస్తున్నాడు. వి.బి.ఆర్. (VBR) దర్శకత్వం వహించిన ఈ చిత్రం సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. మే 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment