సాక్షి, విజయవాడ: ఏపీలో ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఘటనలపై సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు(సోమవారం) ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు.
కాగా, ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో సిట్ బృందం పని ప్రారంభించింది. ఈ మేరకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు.
మాచర్ల, గురజాల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ బృందం ప్రధానంగా దృష్టిసారించింది. కాగా, హింసాత్మక ఘటన తర్వాత అనుమానితుల్లో కొందరు అజ్ఞాతంలోకి, మరికొందరు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మరోవైపు.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్‌లు పరిశీలించి అవసరమైన చోట అదనపు ఎఫ్ఐఆర్‌లను సిట్ నమోదు చేయనుంది. అయితే, కొందరు పోలీసులు ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌లో పలు సెక్షన్లు మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు సిట్ గుర్తించింది. ఇక, హింసాత్మక ఘటనలకు సంబంధించి సీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను సిట్ బృందం పరిశీలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment