విదేశీ మారకంలో నిబంధనల ఉల్లంఘనలు, అక్రమ నిధులను అరికట్టడానికి ఆర్‌బీఐ, ....
‘నల్లధన’ సిట్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: విదేశీ మారకంలో నిబంధనల ఉల్లంఘనలు, అక్రమ నిధులను అరికట్టడానికి ఆర్‌బీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని నల్లధనంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కోరింది. రూ. 100 కోట్లకుపైగా ఎగుమతి బకాయిల వివరాలను ఈడీకి అందజేసింది.
సాధారణంగా బ్యాంకులు ఇప్పటివరకు ఈ సమాచారాన్ని డీఆర్‌ఐ, కస్టమ్స్ సంస్థలకే ఇచ్చేవి. ప్రస్తుత ప్రొటోకాల్ ప్రకారం విదేశాలకు ఎగుమతి చేసే వారు తమకు రావలసిన బకాయిల సమాచారాన్ని 9 నెలల్లోగా ఆర్‌బీఐకి ఇవ్వాలి. లేకపోతే అక్రమాలకు పాల్పడుతున్నట్లు భావిస్తారు. వీటిని విదేశీ మారకం నిబంధనల ఉల్లంఘన, హవాలా కేసులుగా పరిగణిస్తారు. ఇలాంటి కేసులు చాలా ఉన్నట్లు సిట్ గుర్తించింది.