
పల్నాడు, సాక్షి: పోలింగ్ రోజున చెలరేగిన హింస మూడు రోజులైనా చల్లారడం లేదు. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని రెచ్చగొడుతూ.. టీడీపీ శ్రేణులు అవకాశం దొరికినప్పుడల్లా దాడులకు తెగబడుతున్నాయి. దీంతో.. మూడు రోజులుగా జిల్లా అట్టుడుకి పోతోంది.

హింసను కట్టడి చేయడంలో తొలి రెండు రోజులు విఫలమైన పోలీస్ యంత్రాంగం.. ఆలస్యంగా మేల్కోంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది. పల్నాడు కేంద్రంలో 800 మందితో కూడిన కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. అయినా కూడా టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. ‘‘ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారా?’’.. అంటూ దాడులు చేస్తూ పల్నాట మంటల్ని రాజేస్తున్నాయి.

మరోవైపు టీడీపీ నేతలను, శ్రేణుల్ని కట్టడి చేయలేని పోలీసులు.. మాచర్ల, గురజాల ఎమ్మెల్యేలను మాత్రం హౌజ్ అరెస్ట్ చేశారు. మాచర్లలో ఇప్పటికీ షాపులుతెరచుకోలేదు. అక్కడ 2 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని అడుగడుగునా మోహరించారు. అంతటా వాహనాలను పోలీసులు జల్లెడ పుతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో.. మాచర్లలోనే మకాం వేసిన డీఐజీ త్రిపాఠి అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment