
పల్నాడు: ఏదో రకంగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో మాత్రమే పని చేస్తున్న కూటమి ప్రభుత్వం.. తాజాగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసును బనాయించింది. నిన్న( ఆదివారం, సెప్టెంబర్ 7వ తేదీ) మాచర్ల వెళ్లిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
అయితే ట్రాఫిక్‌కు అంతరాయం కల్గించారనే కారణంతో కేసు నమోదు చేశారు పోలీసులు. కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తున్న పోలీసులు.. పిన్నెల్లిపై కేసును నమోదు చేశారు.