పల్నాడు: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరి పేట-పర్చూరు జాతీయరహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట ఈవూరవారిపాలెంలో జరిగిన ఈ ప్రమాదంలో ట్రవెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు, టిప్పర్ పూర్తిగా తగలబడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్, నాలుగురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. 32 మందికి గాయాలు అయ్యాయి. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి ఉంది. గాయపడి వారిని గుంటూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చినగంజాం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు బాపట్ల జిల్లా చినగంజాం మండలం నీలాయపాలెం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఎన్నికలలో ఓటువేసి తిరిగి హైదరాబాదు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాద ఘటన సమాచారాన్ని 108, పోలీసులకు చేరవేయటంతో వెంటనే వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. బైపాస్ పనులు జరుగుతుండటం.. తారురోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవటం వల్ల టిప్పర్ వేగంగా దుసుకువచ్చింది. టిప్పర్ డ్రైవర్ వేగాన్ని కంట్రోల్ చేయకపోవటమే ప్రమాదానికి కారమైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
మృతుల వివరాలు..
అంజి (35) డ్రైవర్, చీరాల, బాపట్ల జిల్లా
ఉప్పుగుండూరు కాశీ (65), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా
ఉప్పుగుండూరు లక్ష్మి (55), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా
ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ (8), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా
Comments
Please login to add a commentAdd a comment