
తాడేపల్లి : ఇటీవల టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్‌సీపీ నేత నర్రెడ్డి లక్ష్మారెడ్డిని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఈ మేరకు నర్రెడ్డి లక్ష్మారెడ్డికి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నర్రెడ్డి లక్ష్మారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్‌తో మాట్లాడారు. బాధితునికి అవసరమైన అత్యుత్తమ వైద్యం అందించాలని డాక్టర్‌ను కోరారు. అదే సమయంలో పార్టీ అండగా ఉంటుందని నర్రెడ్డి లక్ష్మారెడ్డికి భరోసా ఇచ్చారు వైఎస్ జగన్
కాగా, నాలుగు రోజుల క్రితం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జులకల్లులో టీడీపీ గూండాలు.. వైఎస్సార్‌సీపీ నేత లక్ష్మారెడ్డిపై కత్తులు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో లక్ష్మారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నర్రెడ్డి లక్ష్మారెడ్డిని అంతమొందించాలనే రాజకీయ కుట్రలో భాగంగా టీడీపీ ఊరి చివరి కాపు కాసి దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో గ్రామస్తులు అడ్డుకోవడంతో లక్ష్మారెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన్ను పిడుగురాళ్ళలోని పల్నాడు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment