
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్
● జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, జిల్లా ఎస్పీ రవిశంకర్, ఎమ్మెల్యే డాక్టర్‌గోపిరెడ్డి ● తిరునాళ్ల విధులు నిర్వర్తించిన అధికారులకు సత్కారం
నరసరావుపేటరూరల్: సమష్టి కృషితోనే కోటప్పకొండ తిరునాళ్ల విజయవంతం అయిందని పలువురు పేర్కొన్నారు. వినుకొండ రోడ్డులోని ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం రాత్రి అభినందన సభ నిర్వహించారు. కలెక్టర్ శివశంకర్ మాట్లాడు తూ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో తిరునాళ్లకు విస్త్రృత ఏర్పాట్లు చేశారన్నారు. లక్షలాది మంది యాత్రికులు వచ్చినా ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారు లు, సిబ్బంది పనిచేశారన్నారు. జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ క్రమబద్దీకరణతోపాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా విధులు నిర్వర్తించిన పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయ లు మాట్లాడుతూ తిరునాళ్ల ఏర్పాట్లు తనకు సంతృప్తినిచ్చాయన్నారు. గతంలో వీఐపీలు దర్శనం కోసం సామాన్య భక్తు లు ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు. ఈ ఏడాది చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులు దర్శనం చేసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ తిరునాళ్లకు సుమారు 20 లక్షల మంది భక్తులు వచ్చారన్నారు. పల్నాడు జిల్లాగా ప్రకటించిన తరువాత జరిగిన మొదటి తిరునాళ్లను జిల్లా అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించారన్నారు. కొండపైన, దిగువున మున్సిపల్, పంచాయతీ సిబ్బంది చక్కగా నిర్వహించారని ప్రశంసించారు. తిరునాళ్ల విధులు నిర్వర్తించిన అధికారులు, సంక్రాంతి సంబరాలు, జాతీయ స్థాయి వృషభరాజముల ఎడ్ల పందాల నిర్వాహకులను సత్కరించారు. పౌడా చైర్మన్ మిట్టపల్లి రమేష్‌బాబు, ఆర్‌అండ్‌బీ ఈఈ రాజానాయక్, డీఆర్‌ఓ వినాయకం, ఆర్డీఓ శేషారెడ్డి, డీఎఫ్‌ఓ రామచంద్రారావు పాల్గొన్నారు.