
సాక్షి, అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలను నివారించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు ఉన్నతాధికారులను బదిలీ, సస్పెన్షన్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం వారి స్థానాల్లో కొత్తవారిని నియమిస్తూ ఆదేశాలిచి్చంది. పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేష్ బాలాజీ, పల్నాడు ఎస్పీగా మలికా గర్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్థన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని ఎంపిక చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ జవహర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.