IRCTC Entire Train Or Coach Booking In Online: భారతదేశంలో సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు విమానాలను మాత్రమే కాకుండా ట్రైన్స్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. కుటుంబం మొత్తం ప్రయాణించాలనుకున్నప్పుడు ముందుగా రిజర్వ్ చేసుకున్నప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కో చోట సీట్లు అలాట్ చేస్తారు. కానీ మీరందరూ కలిసి వెళ్లాలనుకున్నప్పుడు ఒక కోచ్ మొత్తమ్ బుక్ చేసుకోవచ్చు. ఇది 'ఐఆర్‌సీటీసి'లో ఎలా బుక్ చేసుకోవాలి? ఎంత ఖర్చు అవుతుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
బుక్ చేసుకునే విధానం
ఏదైనా టూర్ వెళ్లాలనుకుని ఒక బృందం మొత్తం ప్రయాణించాలనుకున్నప్పుడు 'పుల్ టారిఫ్ రేట్' అనే బుకింగ్ ఆప్షన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ సర్వీసు కింద ఒక కోచ్ లేదా మొత్తం ట్రైన్ బుక్ చేసుకోవచ్చు. అయితే దీనికోసం ఒక ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వంటివి క్రియేట్ చేసుకోవాలి. దీని కోసం మీరు https://www.ftr.irctc.co.in/ftr/ అనే వెబ్‌సైట్ సందర్సించాల్సి ఉంటుంది. ఇది ఓపెన్ చేసి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి.
ఈ విధంగా మీరు తర్వాత మీరు మొత్తం ట్రైన్ బుక్ చేసుకోవాలా.. లేదా ఒక కోచ్ మాత్రమే బుక్ చేసుకోవాలా.. అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీకు కావలసిన ఆప్షన్ ఎంచుకుని అవసరమైన అన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత చెల్లించాల్సిన మొత్తం అమౌంట్ పే చేసిన తరువాత మీ బుకింగ్ కంప్లీట్ అవుతుంది. ఇందులో మీరు ఏసీ ఫస్ట్ క్లాస్,ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, ఏసీ 2 కమ్ 3 టైర్, స్లీపర్ కోచ్‌లను బుక్ చేసుకోవచ్చు.
(ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్‌టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..)
ఇండియన్ రైల్వే రూల్స్ ప్రకారం, మీరు ఒక కోచ్ బుక్ చేసుకోవాలనుంటే ముందుగా రూ. 50,000 వరకు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఇది మీరు ప్రయాణించే దూరం, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒకవేళా ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు రూ. 9 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ఇలాంటి బుకింగ్ కోసం కనీసం 30 రోజులు లేదా 6 నెలల ముందే బుక్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment