
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీల మధ్య కప్లింగ్ లింకులను సరిచేస్తున్న రైల్వే సిబ్బంది
రేణిగుంట (చిత్తూరు జిల్లా): కాచిగూడ నుంచి చిత్తూరుకు వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు సోమవారం భారీ ప్రమాదం తప్పింది. రెండు బోగీల మధ్య లింకు ఊడిపోవడంతో కొన్ని బోగీలు రైలు నుంచి వేరుపడి నిలిచిపోయాయి. వివరాలు.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఉదయం 7.30 గంటలకు రేణిగంట మండలం మామండూరు రైల్వేస్టేషన్ దాటాక అకస్మాత్తుగా ఎస్2, ఎస్3 బోగీల మధ్య కప్లింగ్ ఊడిపోవడంతో ఎస్3 నుంచి వెనుకవైపున్న బోగీలు వేరుపడి నిలిచిపోయాయి.
ఈ విషయాన్ని గుర్తించే లోపు రైలు అరకిలోమీటర్ దూరం ప్రయాణించింది. అప్రమత్తమైన లోకోపైలట్లు రైలును విడిపోయిన బోగీల వద్దకు వెనక్కి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న మామండూరు స్టేషన్ మాస్టర్లు సిబ్బందితో రైలు వద్దకు చేరుకుని తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.దీంతో 8.25 గంటలకు రైలు రేణిగుంట జంక్షన్‌కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment