
అన్నానగర్: చైన్నె నుంచి శ్రీలంకలోని జాఫ్నాకు అలయనన్స్ ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానం శనివారం ఉదయం 10.05 గంటలకు బయలుదేరేందుకు సిద్ధమైంది. ఆ విమానంలో ప్రయాణించాల్సిన వారు భద్రతా తనిఖీలు ముగించుకుని బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. శ్రీలంకకు చెందిన శివకజన్ లిట్టి(43) తమిళనాడులో ఆధ్యాత్మిక పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లడానికి వచ్చారు.
ఆ సమయంలో ఒక్కసారిగా ఆమె స్పృహతప్పి పడిపోయారు. వైద్యులు పరీక్షించి ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు వెల్లడించారు. ఎయిర్‌పోర్టు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చైన్నె ఎయిర్‌పోర్ట్ పోలీసులు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం చైన్నెలోని శ్రీలంక రాయబార కార్యాలయానికి కూడా సమాచారం అందించారు. దీంతో విమానం గంట ఆలస్యంగా బయలుదేరింది.
Comments
Please login to add a commentAdd a comment