ఏందిరా అయ్యా! మెట్రో ట్రైన్‌లో అంతా చూస్తుండగానే బట్టలు విప్పేసి.. | Man Undressing Taking Bath In Metro Train Video Goes Viral | Sakshi
Sakshi News home page

ఏందిరా అయ్యా! మెట్రో ట్రైన్‌లో అంతా చూస్తుండగానే బట్టలు విప్పేసి..

Published Mon, Apr 10 2023 9:27 PM | Last Updated on Mon, Apr 10 2023 9:46 PM

Man Undressing Taking Bath In Metro Train Video Goes Viral - Sakshi

ఇంటర్నెట్‌ వాడకం క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా క్షణాల్లో నెట్టింట ప్రత్యక్షమవుతోంది. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియా వాడుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. షార్ట్స్‌, రీల్స్‌ అంటూ కొందరు అదే పనిగా వీడియోలు చేయడం నెట్టింట షేర్‌ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఓవర్‌ నైట్‌ సెలబ్రిటీలుగా మారిన ఘటనలు కూడా ఉన్నాయి.  ఇటీవల మెట్రో రైళ్ల‌లో కొందరు ప్ర‌యాణీకుల డ్యాన్స్‌ చేయగా, ఇంకొందరు వెరైటీగా ప్రవర్తించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

తాజగా  న్యూయార్క్ మెట్రో ట్రైన్‌లో ఓ వ్య‌క్తి ప్ర‌యాణీకుల ఎదుటే స్నానం చేసిన వీడియో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ వీడియోలో ఓ ప్రయాణికుడు సూట్‌కేసుతో మెట్రో ట్రైన్‌లోకి ప్రవేశిస్తాడు. చుట్టూ ఉన్న ప్రయాణికులు చూస్తుండగా తన బట్టలు విప్పి.. తనతో తెచ్చుకున్న సూట్‌కేసు తెరచి అందులో నిలబ‌డి స్క్ర‌బ్కింగ్ చేస్తూ స్నానం చేయ‌డం ప్రారంభిస్తాడు. స్నానం పూర్తయ్యాక బ‌ట్ట‌లు వేసుకున్న ట్రైన్ నుంచి వెనుతిరుగుతాడు. ఈ వీడియో గ‌త ఏడాది కాగా ప్ర‌స్తుతం ఇది నెట్టింట తెగ వైర‌ల‌వుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఫన్నీగా ఉందంటూ కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు అలా చేయడం ద్వారా తోటి ప్రయాణికులకు ఇబ్బందిక‌రంగా ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement