
శివాజీనగర(బెంగళూరు): ‘నమ్మ మెట్రో’ ప్రయాణికులకు మరో తీపి కబురు. త్వరలో ‘మెట్రోమిత్రా’ యాప్ విడుదల కానుంది. ప్రయాణికుల అనుకలం కోసం మెట్రోమిత్రా యాప్ ఆధారిత ఆటోరిక్షా సదుపాయాన్ని ఆరంభించబోతోంది. ఆటో– మెట్రో స్టేషన్‌ల ఆరంభం నుంచి ఆఖరి వరకు సేవలు అందుబాటులో ఉంటుందని ఆటో డ్రైవర్ల సమాఖ్య ప్రధాన కార్యదర్శి రుద్రమూర్తి సమాచారం అందించారు.
దీనిద్వారా మెట్రో దిగిన తక్షణమే వేరే ఆటో కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. తొలి రెండు కిలోమీటర్లకు రూ.30, ఆ తరువాత ప్రతి కిలోమీటర్‌కు రూ.15తో పాటుగా రూ.10 అదనపు చార్జీ ఫిక్స్ చేశారు. ఆగస్టు 15న యాప్ విడుదలవుతుందని సమాఖ్య ప్రధాన కార్యదర్శి రుద్రమూర్తి తెలిపారు.
చదవండి: పెళ్లి రోజు నుంచి ప్రియుడితో వీడియో కాల్.. భర్త ఇంట్లోకి వచ్చి చూసేసరికి షాక్!