Akasa Air announces 1st anniversary celebrations with mega sale - Sakshi
Sakshi News home page

విమాన ప్రయాణీకులకు బంపర్‌ ఆఫర్‌:మెగా సేల్‌

Published Thu, Aug 3 2023 10:40 AM | Last Updated on Thu, Aug 3 2023 12:49 PM

Akasa Air announces first anniversary celebrations with mega sale - Sakshi

విమాన  ప్రయాణికులకు గుడ్‌ న్యూస్. దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ బడ్జెట్‌ ధరల ఆకాశ ఎయిర్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది.  తొలి వార్షికోత్సవం సందర్భంగా తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తోంది.  స్పెషల్ వార్షికోత్స సేల్స్  ద్వారా విమాన టికెట్లపై 15 శాతం మేర డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ 16 డొమెస్టిక్ రూట్లకు వర్తిస్తుందని ఆకాశ ఎయిర్‌ తెలిపింది. 

ఆకాశ ఎయిర్ వెబ్‌సైట్, యాప్‌లోకి వెళ్లి వార్షికోత్సవం ఆఫర్ కింద 15 శాతం తక్కువ ధరకే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఆగస్టు 7 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ సేల్ ఆకాశ ఎయిర్ సేవల్, ఫ్లెక్సీ ఫేర్ టికెట్లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు ఆకాశ ఎయిర్ వెబ్‌సైట్‌లో AKASA1 కోడ్ ఉపయోగించడం ద్వారా ఆఫర్ పొందవచ్చు. అలాగే ఆకాశ ఎయిర్ లైన్స్ యాప్‌లో APPLOVE కోడ్ ఉపయోగించి ఆఫర్ అందుకోవచ్చు. దేశీయంగా 16 రూట్లలో  ప్రయాణానికి ఈ మెగా సేల్‌ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు.

కంపెనీ యాప్‌లో ప్రత్యేకంగా బుక్ చేసుకున్న తర్వాత, ప్రయాణీకులు జీరో కన్వీనియన్స్  ఫీజు పొందే అవకాశం  కూడా ఉంది.  తద్వారా ప్రతి బుకింగ్‌పై అదనంగా రూ. 350 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి, అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి ఎయిర్‌లైన్ నిబద్ధతలో భాగంగా అందిస్తున్న  పరిమిత-కాల ఆఫర్అని కంపెనీ వెల్లడించింది. 

అంతేకాదు అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించే క్రమంలో ఆగస్ట్ 1న, అకాశఎయిర్ 20వ ఎయిర్‌క్రాఫ్ట్‌ 737 MAX ను తన ఖాతాలో  చేర్చుకున్నట్లు ప్రకటించింది. 12 నెలల్లోపు సున్నా నుండి 20 విమానాలకు వెళ్లడం కేవలం ఆకాసా రికార్డు మాత్రమే కాదు రికార్డు" అని ఆకాశ ఎయిర్‌ వ్యవస్థాపకుడు , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినయ్ దూబే  పేర్కొన్నారు.

కాగా   ప్రముఖ స్టాక్‌మార్కెట్‌ ఇన్వెస్టర్‌  రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ లైన్ 2022, ఆగస్టులో తన సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 35 మార్గాల్లో వారానికి 900 విమానాలను నడుపుతోంది. ప్రధానంగా ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గువాహటి, అగర్తల, పుణే, లఖ్‌నవూ, గోవా, హైదరాబాద్, వారణాసి, భువనేశ్వర్, కోల్‌కతాలకు విమాన సేవలు అందిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement