
న్యూఢిల్లీ: మార్కెట్ బిగ్‌బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాల నుంచి వస్తోన్న ఆకాశ ఎయిర్‌లైన్స్ కొత్త విమానాలను కొనుగోలు చేస్తోంది. అందులో భాగంగా తాజాగా ఆకాశ ఎయిర్ ఖాతాలో బోయింగ్ 737 మ్యాక్స్ వచ్చి చేరింది. 2021 నవంబర్‌లో ఆకాశ ఎయిర్, బోయింగ్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బోయింగ్ నుంచి మ్యాక్స్ రకం 72 విమానాలను ఆకాశ కొనుగోలు చేయనుంది. తొలి విమానం గురువారం డెలివరీ అందుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. 2023 మార్చి నాటికి 18 విమానాలు సంస్థకు చేరనున్నాయి. మిగిలినవి తదుపరి నాలుగేళ్లలో అడుగుపెడతాయి.
చదవండి: విమాన చార్జీలను 15% పెంచాలి
Comments
Please login to add a commentAdd a comment