విమానంలో ప్రయాణికుల వికృతి ఘటనలు గురించి తరుచుగా విన్నాం. కానీ ఇప్పుడూ ఒక ప్రయాణికుడు అలా ఏం చేయకపోయినా విమాన నుంచి బయటకు గెంటేశారు. అదీకూడా కేవలం డ్రింక్ చేస్తానని రిక్వెస్ట్ చేసినందుకు విమానం నుంచి బలవంతంగా బయటకు పంపించేశారు. ఈ ఘటన యూఎస్ ఎయిర్‌లైన్స్‌లో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని ఒక వ్యక్తి విమానం బయలుదేరే ముండు డ్రింక్ చేస్తానని తనకు జిన్ వంటి పానీయం కావాలని అడిగాడు. అంతే అక్కడ ఉన్న సిబ్బంది సదరు వ్యక్తిని విమానం నుంచి దిగిపోమని సీరియస్ అయ్యారు. మొత్తం సిబ్బంది వచ్చి దిగిపోమని పలుమార్లు సూచించారు. అతనికేం అర్థం కాక ఎందుకిలా అంటున్నారని ఆ ఘటనను మొత్తం ఫోన్‌తో వీడియో తీసేందుకు రెడీ అయ్యాడు.
అంతే అక్కడ ఉన్న సిబ్బంది, ఫ్లైట్ అటెండెంట్ అతని ఫోన్‌ని లాక్కుని, ఆ వ్యక్తిని బలవంతంగా విమానం నుంచి బయటకు గెంటేశారు. తదనంతరం అక్కడ ఉన్న ఎయిర్‌పోర్ట్ భద్రతా విభాగం అతన్ని అరెస్టు చేశారు. ఐతే సిబ్బంది అసహనంతో అలా చేశారా లేక ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడో తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించిన వీడియో రెడ్‌ఇట్‌లో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు మండిపడ్డారు. అతను చిన్నపిల్లాడిలా అలా చేయడం ఆశ్చర్యంగా అనిపించిందని కొందరూ, ఇది అత్యంత అవమానకరం అని మరికొందరూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: కాల్పుల భయంలో అమెరికా..పరుగెత్తండి, దాక్కోండి అంటూ యూనివర్సిటీ హడావిడి..)
Comments
Please login to add a commentAdd a comment