నిద్రలో భుజంపై వాలితే అలా కొడతారా..? | Man Knocks Out Passenger Who Fell Asleep On His Shoulder - Sakshi
Sakshi News home page

నిద్రలో భుజంపై వాలితే అలా కొడతారా..?

Published Sun, Aug 27 2023 9:29 PM | Last Updated on Mon, Aug 28 2023 10:42 AM

Man Knocks Out Passenger Who Fell Asleep On His Shoulder - Sakshi

న్యూయార్క్‌: నిద్రలో భుజంపై వాలిపోయినందుకు పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడో వ్యక్తి. మోచేయితో భీకరంగా దాడి చేయగా.. బాధితుడు అక్కడే మూర్చపోయాడు. బాధితుని స్నేహితులు తిరగబడటంతో పరిస్థితి రణరంగంగా మారింది. ఈ దారుణ ఘటన న్యూయార్క్‌లోని మెట్రో రైలులో జరిగింది.

మెట్రో రైలు ఫారెస్ట్ హిల్స్ 71వ అవెన్యూ స్టాప్‌ సమీపంలో సబ్‌వేకు చేరేసరికి ఉదయం 5:30 గంటల సమయం అవుతోంది. నిద్రలో పక్కనే ఉన్న ఓ ప్యాసింజర్ భుజంపై అనుకోకుండా వాలిపోయాడో వ్యక్తి. దీంతో ఆ ప్యాసింజర్‌ వాగ్వాదానికి దిగాడు. నిద్రలో ఉన్న వ్యక్తి స్నేహితులు ఆ ప్యాసింజర్‌తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆగ్రహంతో పక్కనే ఉన్న వ్యక్తిని మోచేతితో బలంగా దాడి చేశాడు. అంతే.. ఆయన అక్కడే మూర్చపోయాడు. 

బాధితుని స్నేహితులు గొడవకు దిగారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో మెట్రో ఆ కంపార్ట్‌మెంట్ రణరంగంగా మారింది. ఆ వెంటనే స్టాప్‌ రావడంతో అందరూ దిగిపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.   దాడి చేసిన వ్యక్తిని గాలిస్తున్నారు.  

ఇదీ చదవండి: ఏంటి గురూ..! ఏకంగా విమానంలోనే ఇలా చేస్తావా..?


     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement