asleep
-
స్టేషన్ మాస్టర్‌కు నిద్రొచ్చింది.. లోకో పైలెట్ హారన్ మోగించినా..
రైలు ప్రయాణాన్ని ఇష్టపడని వారెవరూ ఉండరనడంలో అతిశయోక్తి లేదు. మరి రైలు ప్రయాణంలో అనుకోని ఘటన ఏదైనా జరిగితే అది వార్తల్లో నిలుస్తుంది. తాజాగా అటువంటి ఉదంతమే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా సమీపంలోని ఉదీ మోడ్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో పట్నా-కోటా ఎక్స్‌ప్రెస్ రైలు గ్రీన్ సిగ్నల్ కోసం అరగంట పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్టేషన్ ఆగ్రా డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న ఆగ్రా రైల్వే డివిజన్ అధికారులు ఈ నిర్లక్ష్యానికి కారణాన్ని వివరించాలని స్టేషన్ మాస్టర్‌ను ఆదేశించారు.ఈ ఘటన గురించి ఆగ్రా రైల్వే డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్ఓ) ప్రశస్తి శ్రీవాస్తవ మాట్లాడుతూ తాము ఈ విషయంలో స్టేషన్ మాస్టర్‌కు ఛార్జ్ షీట్ జారీ చేశామని, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా ఘటన జరిగిన సమయంలో స్టేషన్ మాస్టర్‌ను నిద్రలేపడానికి రైలులోని లోకో పైలట్ పలుమార్లు హారన్ మోగించారు.అరగంట తరువాత స్టేషన్ మాస్టర్ నిద్రనుంచి మేల్కొని రైలు వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తరువాత స్టేషన్ మాస్టర్ తన తప్పును అంగీకరించి, క్షమాపణ చెప్పారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డ్యూటీలో ఉన్న ‘పాయింట్‌మెన్’ ట్రాక్‌ను పరిశీలించడానికి వెళ్లాడని, దీంతో ఆ సమయంలో తాను స్టేషన్లో ఒంటరిగా ఉన్నానని ఆ స్టేషన్ మాస్టర్ తెలిపారు. -
నిద్రలో భుజంపై వాలితే అలా కొడతారా..?
న్యూయార్క్: నిద్రలో భుజంపై వాలిపోయినందుకు పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడో వ్యక్తి. మోచేయితో భీకరంగా దాడి చేయగా.. బాధితుడు అక్కడే మూర్చపోయాడు. బాధితుని స్నేహితులు తిరగబడటంతో పరిస్థితి రణరంగంగా మారింది. ఈ దారుణ ఘటన న్యూయార్క్‌లోని మెట్రో రైలులో జరిగింది. మెట్రో రైలు ఫారెస్ట్ హిల్స్ 71వ అవెన్యూ స్టాప్ సమీపంలో సబ్‌వేకు చేరేసరికి ఉదయం 5:30 గంటల సమయం అవుతోంది. నిద్రలో పక్కనే ఉన్న ఓ ప్యాసింజర్ భుజంపై అనుకోకుండా వాలిపోయాడో వ్యక్తి. దీంతో ఆ ప్యాసింజర్ వాగ్వాదానికి దిగాడు. నిద్రలో ఉన్న వ్యక్తి స్నేహితులు ఆ ప్యాసింజర్‌తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆగ్రహంతో పక్కనే ఉన్న వ్యక్తిని మోచేతితో బలంగా దాడి చేశాడు. అంతే.. ఆయన అక్కడే మూర్చపోయాడు. New York man elbows another passenger on the subway #subwaycreatures #nyc #frailego pic.twitter.com/N6KX6ltBIz — Rama (@EyesWitness00) August 24, 2023 బాధితుని స్నేహితులు గొడవకు దిగారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో మెట్రో ఆ కంపార్ట్మెంట్ రణరంగంగా మారింది. ఆ వెంటనే స్టాప్ రావడంతో అందరూ దిగిపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన వ్యక్తిని గాలిస్తున్నారు. ఇదీ చదవండి: ఏంటి గురూ..! ఏకంగా విమానంలోనే ఇలా చేస్తావా..? -
వెంటనే నిద్ర రావాలంటే ఏం చేయాలి?
మనిషికి నిద్ర చాలా ముఖ్యం. నిద్రలేమి అనేది హృదయ సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఊబకాయం, చిత్తవైకల్యం మొదలైన సమస్యలను సృష్టిస్తుంది. మానసిక స్థితిని త్రీవంగా ప్రభావితం చేస్తుంది. మతిమరపును కలిగిస్తుంది. రోగనిరోధక వ్యవస్థలోని ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. అటువంటి సందర్భాలలో ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు ఎవరైనా సరే మంచి ప్రశాంతతను పొందుతారు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ హెల్త్ తెలిపిన వివరాల ప్రకారం అణు రియాక్టర్ మెల్ట్డౌన్లు, పెద్ద ఓడలు మునిగిపోవడం, విమాన ప్రమాదాలు వంటి విషాదకర సంఘటనల వెనుక నిద్రలేమి కారణంగా నిలుస్తుంది. సైన్యంలో పని చేసేవారికి నిద్రా సమయం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వారు నిద్ర వచ్చేందుకు, మంచి విశ్రాంతి తీసుకునేందుకు ఒక టెక్నిక్ అనుసరిస్తారు. దానిని మిలటరీ మెథడ్ అని అంటారు. ఈ విధానం ద్వారా ఎవరైనా సులభంగా త్వరగా నిద్రపోవచ్చు. అది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిసారిగా 1981లో ‘రిలాక్స్ అండ్ విన్: ఛాంపియన్షిప్ పెర్ఫార్మెన్స్’ అనే పుస్తకంలో ఈ టెక్నిక్కు సంబంధించిన పలు వివరాల అందించారు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరకారంలో మిలిటరీ పద్ధతిని ఉపయోగించిన ప్రీ-ఫ్లైట్ స్కూల్లోని పైలట్లు 10 నిమిషాల్లోనే నిద్రపోయారని ఆ పుస్తకంలో తెలియజేశారు. ఈ పద్ధతిని ఉపయోగించిన 96% పైలట్లు యుద్ధ సమయంలోనూ కొద్దిసేపటికే మంచి విశ్రాంతి తీసుకోగలిగారని వెల్లడయ్యింది. ఐదు దశల్లో త్వరగా నిద్ర ఈ మ్యాజిక్ టెక్నిక్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధానం ద్వారా ఎవరైనా సరే త్వరగా నిద్రపోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1 మీ ముఖాన్ని రిలాక్స్ చేయండి: మీ ముఖంలోని నుదురు, కళ్ళు, బుగ్గలు, దవడ మొదలైన వాటిపై దృష్టి పెట్టండి. వాటిపై ఒత్తిడి ఉన్నట్లు భావించి, తరువాత దానిని వదిలివేసి, రిలాక్స్ అవుతున్నట్లు భావించండి. 2 మీ భుజాలను వదులు చేయండి: మీ చేతులను రిలాక్స్ చేయండి. మీ భుజాలు విశ్రాంతిగా ఉన్న భావన చేయండి. చేతులు, భుజాల మీదుగా గాలి తగులుతూ అది మెల్లగా మీ చేతుల కిందకి వస్తున్నట్లు ఊహించండి. 3 గట్టిగా ఊపిరి తీసుకోండి. నెమ్మదిగా గాలిని బయటకు వదలండి. మీరు అలా చేస్తున్నప్పుడు, అది మీ కడుపుని ఎలా తేలికపరుస్తున్నదనే దానిపై దృష్టి పెట్టండి. మీ కడుపును బిగపట్టడానికి ప్రయత్నించవద్దు. అన్ని అవయవాలు తేలికపడినట్లు భావించండి. 4 మీ కాళ్ళను విశ్రాంతి తీసుకోనివ్వండి. నునువెచ్చని గాలి మీ కాళ్ళను సున్నితంగా తాకుతున్నట్లు భావించండి. మీ కాళ్ళు మంచంపై రిలాక్స్ అవుతున్నట్లు చేయండి. 5 మీ మనసును ప్రశాంతపరచండి. ఇందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు మేఘాలను తదేకంగా చూడడం లేదా ప్రశాంతమైన చిత్రాలను చూసేందుకు ప్రయత్నించండి. 10 సెకన్ల పాటు మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా చూసుకోండి. అప్పుడు మీకు త్వరగా నిద్రపడుతుంది. అభ్యాసంతో సాధ్యం ఈ మిలటరీ మెథడ్ గురించి సైన్స్ ఏమి చెబుతున్నదంటే.. ఈ విధానంలోని1, 2, 5 దశలు కండరాలకు సడలింపునిస్తాయి. ప్రశాంతతకు, శాంతియుత స్థితిని ప్రేరేపించడానికి మంచి మార్గాలుగా నిలుస్తాయి. మూడవ దశలో శ్వాస పద్ధతులు మెరుగుపడతాయి. ఐదవ దశ శరీరాన్ని మరింత రిలాక్స్ చేస్తుంది. ఈ ప్రక్రియ అత్యంత త్వరగా నిద్రను అందిస్తుంది. ఈ మిలటరీ మెథడ్‌లో అనేక ప్రయోజనాలుఉన్నాయి. నిద్ర అలవాట్లను మెరుగుపరచడానికి ఉత్తమమైన మార్గాలలో ఇది ఒకటి అని పలు పరిశోధనలలో తేలింది. అయితే మిలటరీ మెథడ్‌లో తక్షణ ఫలితాలను ఆశించకూడదని, ఇది అలవడేందుకు రెండు నుంచి ఆరు వారాల సమయం పట్టవచ్చని నిపుణులుచెబుతున్నారు. ఇది కూడా చదవండి: బాధితులకు వైద్య సేవలు అందించే ఎక్స్‌ప్రెస్ రైలు -
విమానం నడిపేటప్పుడు పైలట్లు పడుకుంటారట!
కాలిఫోర్నియా: మనం విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మన ప్రాణాలు ఆ భగవంతుడి చేతుల్లో ఉంటాయని అనుకుంటాం. కానీ పెలైట్లు నిద్రపోయారా, లేదా? అన్న అంశంపై ఆధారపడి ఉంటాయని మనకు తెలియదు. కాక్‌పీట్ లాక్ చేసుకుంటారు కనుక లోపల ఏం జరుగుతుందో మనకు కనిపించదు. ఎలాంటి అంతరాయం లేకుండా ఏకాగ్రతతో విమానం నడిపేందుకే వారలా కాక్‌పిట్ లాక్ చేసుకుంటారని భావిస్తాం. వాస్తవానికి చాలా మంది పెలైట్లు కునుకు తీస్తారట. కొందరైతే విమానాన్ని ఆటోమోడ్‌లోకి మార్చి ఏకంగా గురకపెడతారట. ఇవి ఎవరో అక్కసుతో చెప్పిన మాటలు కాదు సుమా! స్వయంగా పెలైట్లు తమంతట తాముగా వెల్లడించిన విషయాలు. ఇవి పెలైట్లు అధికారుల ముందు అంగీకరించిన విషయాలు కావు. చర్చిలోకెళ్లి పశ్చాత్తాప పడినట్లుగానే ఆ పెలైట్లు ‘విస్పర్ యాప్’లో తమ గురించి తాము చెప్పుకున్నారు. గుర్తింపు చెప్పుకోవాల్సిన అవసరం లేదుకనకనే వారు కన్ఫెషన్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ యాప్‌ను ఆశ్రయించారు. వారు చెప్పిన విషయాలు వారి మాటల్లోనే...... ‘నేనో పెలైట్‌ని. టోక్యో నుంచి గమ్యానికి వెళుతున్నాను. నేను, నా కెప్టెన్ 15 నిమిషాల పాటు నిద్రపోయాను.....నేను ప్రధాన విమానయాన సంస్థలో కోపెలైట్గా పని చేస్తున్నాను. కాసేపు కునుకుతీసి లేచేసరికల్లా నా పక్కన పెలైట్ కూడా నిద్రపోతున్నారు.....నేను పెలైట్‌ని. మార్గమధ్యంలో నేను ఒక్కసారి కూడా నిద్రపోకుండా విమానాన్ని ఇంతవరకు ఒక్కసారి కూడా నడపలేదు.....నేను పెలైట్‌ని. ప్రయాణికులను భయపెట్టడమంటే సరదా. ఉద్దేశపూర్వకంగానే ఫ్లాష్ లైట్లను వేసి, అలారం మోగించి ప్రయాణికులను భయపెట్టిన సందర్భాలు ఉన్నాయి....నాకు ఎక్కువ ఎత్తులో ప్రయాణించడమంటే భయం. ఎత్తై భవనాన్ని ఢీకొట్టినట్టు అనిపిస్తుంది.....విమానం ఎగిరేటప్పుడు, దిగేటప్పుడు సెల్ఫోన్లను ఎరోప్లేన్ మోడ్‌లోకి తప్పనిసరిగా మార్చుకోవాల్సిందిగా ప్రయాణికులను హెచ్చరిస్తాం. కానీ పెలైటైన నేను ఎన్నడూ నా మొబైల్‌ను ఎరోప్లేన్ మోడ్‌లోకి మార్చ లేదు’ అంటూ మరొకరు కాక్‌పిట్ కన్ఫెషన్లు వినిపించారు.