
రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. కొన్ని విపత్కర పరిస్థితుల్లో ట్రైన్ జర్నీ క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో డబ్బులు కూడా నష్టపోవాల్సి వస్తుంది. అలా కాకుండా ప్రయాణికుల సౌకర్యార్ధం.. క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్న ట్రైన్ టికెట్‌ను ఇతర కుటుంబ సభ‍్యులకు బదిలీ చేసేలా ఐఆర్‌సీటీసీ వెసలుబాటు కల‍్పించింది.
టికెట్ కన్ఫర్మ్ అయినవారు..వారి టికెట్ టికెట్‌ను కుటుంబ సభ్యులకు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే 24గంటల ముందే అప్లయ్ చేయాలి. ఇక్కడ ప్రయాణికులు గమనించాల్సిన విషయం ఏంటంటే.. క్యాన్సిల్ అయ్యే టికెట్‌ను ఒక్కసారి మాత్రమే బదిలీ చేసుకునే అవకాశం ఉంది.
టికెట్‌ను ట్రాన్స్ ఫర్ చేయాలంటే
కన్ఫర్మ్ టికెట్ ప్రింటవుట్ తీసుకోవాలి. ఎవరికైతే టికెట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో వారి ఆధార్ కార్డు, లేదంటే ఓటర్ ఐడి ఉండాలి. రైల్వే స్టేషన్ టికెట్ రిజర్వేషన్ కౌంటర్‌లో టికెట్‌ను బదిలీ చేయమని కోరుతూ అప్లయ్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment