
రాజంపేట: పాము కాటుకు తండ్రీకొడుకులు బల య్యారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శేర్ శంకర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు మామిళ్ల తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండాకు చెందిన ముద్రిచ్చ రవి (40) తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రవి తనభార్యతో కలసి రోజూలాగే శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు.
రాత్రి భార్యాపిల్లలతో కలసి భోజనం చేసిన అనంతరం అందరూ కలసి పడుకున్నారు. రాత్రి 11.30 గంటల సమయంలో నిద్రలోంచి లేచిన రవి తన చేతిపై నుంచి పాము వెళ్లినట్లు భార్య మంగినికి తె లిపాడు. దీంతో భార్యాభర్త లు దేవుని పేరు తలచుకుని ముడుపు కట్టారు. తర్వాత ఇంట్లో పామును గుర్తించిన రవి కర్రతో కొట్టి దానిని చంపాడు. ఇదిలా ఉండగా అర్ధ రాత్రి 12 గంటల తర్వాత చిన్నకొడుకు వినోద్(11) ఛాతీలో నొప్పివస్తోందని చెప్పి.. అంతలోనే వాంతు లు చేసుకున్నాడు. కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పో యాడు.
అదే సమయంలో తనకు కళ్లు తిరుగు తున్నాయని రవి భార్య మంగినికి తెలిపాడు. దీంతో వారు పాము కాటుకు గురైనట్లు గ్రహించిన మంగిని చుట్టుపక్కల వారి సహాయంతో రవిని శనివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో అంబులెన్సులో కామారెడ్డి ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ తెల్లవారు జామున 4 గంటలకు రవి సైతం మరణించాడు. ఒకే రోజు తండ్రీ కొడుకుల మరణంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment