
కామారెడ్డి జిల్లా: రాజంపేట మండలంలోని షేర్ శంకర్ తండాలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో పాము కాటుకు గురై తండ్రి రవి (40), కుమారుడు వినోద్ (12) మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు వినోద్‌ని మొదట పాము కరిచింది. ఇది గమనించిన తండ్రి రవి పామును చంపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రవిని సైతం పాము కాటు వేసింది.
అయితే ఆస్పత్రికి వెళ్లకుండా స్థానికంగా ఏదో ఆకు పసరు వేసుకుని.. తమకు ఏమీ కాదనే నమ్మకంతో ఉన్నారు. ఇంతలోనే వినోద్ ప్రాణాలు కోల్పోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు.. రవిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవి కూడా ప్రాణాలు కోల్పోయాడు. పాము కరిచిన వెంటనే ఆసుపత్రికి తరలించి ఉంటే ఇద్దరి ప్రాణాలు నిలిచేవని కుటుంబసభ్యులు వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment