రాజంపేట: పాము కాటు కారణంగా ఓ పేదింట విషాదం నెలకొంది. అర్ధరాత్రి పాము కాటుకి తండ్రీకొడుకులు బలయ్యారు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వారి మృతితో భార్య అనాథగా అయిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీటిపర్యంతమవువున్నారు.
వివరాల ప్రకారం.. రాజంపేట మండలం శేర్ శంకర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు మామిళ్ల తండాకు చెందిన ముద్రిచ్చ రవి (40) తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రవి తనభార్యతో కలసి రోజూలాగే శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. రాత్రి భార్యాపిల్లలతో కలసి భోజనం చేసిన అనంతరం అందరూ కలసి పడుకున్నారు.
అయితే, రాత్రి 11.30 గంటల సమయంలో నిద్రలోంచి లేచిన రవి తన చేతిపై నుంచి పాము వెళ్లినట్లు భార్య మంగినికి తెలిపాడు. దీంతో భార్యాభర్తలు దేవుని పేరు తలచుకుని ముడుపు కట్టారు. తర్వాత ఇంట్లో పామును గుర్తించిన రవి కర్రతో కొట్టి దానిని చంపాడు. ఇదిలా ఉండగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత చిన్నకొడుకు వినోద్(11) ఛాతీలో నొప్పివస్తోందని చెప్పి.. అంతలోనే వాంతులు చేసుకున్నాడు. కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పో యాడు.
అదే సమయంలో తనకు కళ్లు తిరుగుతున్నాయని రవి భార్య మంగినికి తెలిపాడు. దీంతో వారు పాము కాటుకు గురైనట్లు గ్రహించిన మంగిని చుట్టుపక్కల వారి సహాయంతో రవిని శనివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో అంబులెన్సులో కామారెడ్డి ఆస్పత్రికి తరలించింది. చికిత్స పొందుతూ తెల్లవారు జామున 4 గంటలకు రవి సైతం మరణించాడు. ఒకే రోజు తండ్రీ కొడుకుల మరణంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో బీఆర్‌ఎస్ నేత, తనయుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment