
సాక్షి,కామారెడ్డిజిల్లా: సోషల్‌మీడియాలో పాపులర్ అవ్వాలన్న కోరిక మరో ప్రాణాన్ని బలిగొన్నది. సాహసం చేసి పేరుతెచ్చుకునే మాట అటుంచితే యుక్త వయస్సులోనే ఆయుష్షు పూర్తయిపోయింది. కామారెడ్డి జిల్లా దేశాయిపేటలో శుక్రవారం(సెప్టెంబర్6) విషాద ఘటన జరిగింది.
సోషల్‌మీడియాలో వైరల్ అయ్యేందుకు శివరాజు అనే యువకుడు ఏకంగా విష సర్పాన్నే నోటితో కరిచి పట్టుకున్నాడు. ఈ దృశ్యాలను వీడియో తీయాల్సిందిగా స్నేహితులకు చెప్పాడు. ఇంకేముంది షరామామూలుగానే పాము తన సహజ స్వభావంతో యువకున్ని కాటు వేసింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన శివరాజును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివరాజు తుద్విశ్వాస విడిచాడు. యువకుడు అకారణంగా చనిపోవడంపై కుటుంబసభ్యులు కనీరుమున్నీరవుతున్నారు. పాముకాటుతో మృతిచెందిన శివరాజు ఇటీవల పాములు పట్టడంలో శిక్షణ పొందుతున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment