
నిజామాబాద్: పాము కాటుకు గురైన మూడేళ్ల బాలుడు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలకు చెందిన మంగళి భూమయ్య, హర్షిత దంపతులకు రుద్రాన్ష్ (3), మూడు నెలల కుమార్తె ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇంట్లో ఉన్న ఓ గది కూలిపోయింది. దీంతో పక్కనున్న మరో గదిలో వీరంతా శుక్రవారం నిద్రించారు.
ఈ క్రమంలో రెండు పాములు వచ్చి రుద్రాన్ష్‌ను కాటు వేశాయి. బాలుడు గట్టిగా ఏడవడంతో అక్కడి నుంచి వెళ్తున్న పాములను తండ్రి భూమయ్య గమనించాడు. వెంటనే వాటిని కర్రతో కొట్టి చంపాడు. అనంతరం బాలుడిని జిల్లా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment