
సరస్వతి (ఫైల్)
సి.బెళగల్(కర్నూలు జిల్లా): ఈనెలాఖరులో పెళ్లి జరగాల్సిన యువతి పాముకాటుకు గురై ప్రాణాలొదిలింది. మండల పరిధిలోని గుండ్రేవుల గ్రామంలో సోమవారం రాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. గ్రామంలోని బీసీ కాలనీలో నివాసముంటున్న నారాయణ, వెంకటమ్మ దంపతులకు కుమారుడు బడేసావ్, కూతురు సరస్వతి (18) ఉన్నారు.
సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి సరస్వతి పొలం పనులకు వెళ్లగా అక్కడ పాము కరిచింది. వెంటనే కుటుంబసభ్యులు ఆ యువతిని చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్య లోనే మృతిచెందింది.
ఈ యువతికి సి.బెళగల్ గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. నెలాఖరులో పెళ్లి చేయాలని ఇరుకుటుంబాల పెద్దలు నిశ్చయించారు. ఈ తరుణంలో పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
చదవండి: పుట్టు మచ్చలతో జాతకాలు మారుస్తామంటూ.. నగ్న చిత్రాలు సేకరించిన ముఠా
Comments
Please login to add a commentAdd a comment