Snake Bite Salman Khan At His Panvel Farm House, Details Inside - Sakshi
Sakshi News home page

Snake Bites Salman Khan: పాము కాటుకు గురైన సల్మాన్‌..ఆరోగ్యం ఎలా ఉందంటే?

Dec 26 2021 12:37 PM | Updated on Dec 27 2021 4:27 PM

Snake Bites Salman Khan At His Panvel Farm House, Details Inside - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ పాము కాటుకు గురయ్యాడు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ పాము కాటుకు గురయ్యాడు. పన్వేల్‌లోని ఫామ్‌ హౌస్‌లో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తాజా సమాచారం  ప్రకారం వీకెండ్‌ విడిది కోసం శనివారం ఫామ్‌ హౌస్‌కి వెళ్లాడు. అర్థరాత్రి దాటక అతని కాలుపై పాము కాటేసింది. దీంతో అతని వ్యక్తిగత సిబ్బంది హుటాహుటిన ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే సల్లూ భాయ్‌ని విషం లేని పాము కాటేసిందని, దాని వల్ల అతని ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.

చికిత్స అనంతరం ఆదివారం ఉదయం సల్మాన్‌ తిరిగి తన ఫామ్‌ హౌస్‌కి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉందని, కొన్ని రోజుల పాటు ఫామ్‌హౌస్‌లోనే విశ్రాంతి తీసుకుంటారని ఆయన సన్నిహితులు తెలిపారు.  (Salman Khan 56th birthday: సల్లూ భాయ్‌కి హ్యాపీ బర్త్‌డే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement