Girl Died Of Snake Bite While She Was Asleep At Her House In Bapatla - Sakshi
Sakshi News home page

నిద్రిస్తున్న బాలికను కాటు వేసిన నాగుపాము

Published Mon, Jul 17 2023 1:46 AM | Last Updated on Mon, Jul 17 2023 11:59 AM

- - Sakshi

దుర్గి/చిలకలూరిపేట టౌన్‌: పాముకాటులో బాలిక మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని అడిగొప్పల యానాది కాలనీకి చెందిన కొమరగిరి అనిల్‌ బాబు, పూజ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె మౌనిక స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు చిలకలూరిపేట మండలం పోతవరం గ్రామంలో కూలీ పనులు కోసం వెళ్లారు.

ఆదివారం పాఠశాలకు సెలవు కావటంతో శనివారం బంధువులతో తల్లిదండ్రుల వద్దకు పోతవరం వెళ్లింది. తల్లిదండ్రులతో ఆటపాటలతో సంతోషంగా గడిపి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురైంది. పాప ఏడవడంతో తల్లిదండ్రులు పాము కాటు అని గుర్తించి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు చికిత్స కొనసాగిస్తున్న క్రమంలో బాలిక మృతి చెందింది.

విషయం తెలుసుకున్న సర్పంచి నలబోతు చిన్నబ్బాయి మృతి చెందిన బాలిక కుటుంబానికి మట్టి ఖర్చులు కోసం రూ.5వేల ఆర్ధిక సహాయం అందజేశారు. కుటుంబ సభ్యులను వైస్‌ ఎంపీపీ చల్లా శ్రీనివాసరావు, ఎంపీటీసీ షేక్‌ హుసేన్‌ పరామర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement