కర్నూలు: రాత్రి మిద్దైపె నిద్రిస్తున్న భార్యాభర్తలను పాము కాటు వేయడంతో భార్య మృతి చెందగా, భర్త ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని గుండ్రేవుల గ్రామంలోని పాత బీసీ కాలనీలో నివాసముంటున్న గొల్ల చిన్న భాస్కర్, లక్ష్మి (38) దంపతులు సోమవారం రాత్రి భోజనం అనంతరం మిద్దైపె నిద్రకు ఉపక్రమించారు.
రాత్రి 11 గంటల అనంతరం గొల్ల చిన్న భాస్కర్‌ను పాము కాటువేయడంతో విదిల్చి పడేయగా పక్కనే ఉన్న లక్ష్మి కాలికి కాటు వేసింది. ఆమె కాలిని వదలకుండా పట్టుకోవడంతో ఇద్దరూ కలిసి పామును తొక్కి చంపేశారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువుల సాయంతో వెంటనే కర్నూలు పెద్దాస్పత్రికి వెళ్లారు. చికిత్స పొందుతూ కోలుకోలేని లక్ష్మి మృతిచెందగా చిన్న భాస్కర్ కోలుకుంటున్నాడు. లక్ష్మి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment