sanke
-
కట్లపాము.. అది చచ్చిన పామైనా జాగ్రత్తగా ఉండాలే..
బుట్టాయగూడెం: వర్షాకాలంలో పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతంలోని సరిహద్దు గ్రామాల్లో, దట్టమైన పొదల సమీపంలో పాములు తరచూ సంచరిస్తుండటం సాధారణమే. అయితే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పాముకాటుకు గురికాక తప్పదు. గత వారం రోజుల్లో పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో పాము కాటు కేసులు ఎక్కువగా నమోదవుతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అదేవిధంగా మండ్రకప్ప, తేలు కాటుకు గురై పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ పాములు, ఇతర విష కీటకాల బెడద ఉంటుంది. వీటి బారిన పడకుండా అప్రమత్తంగా ఉంండాలని వైద్యులు సూచిస్తున్నారు. అన్ని పాములు ప్రమాదకరం కాదు మనకు కనిపించే అన్ని పాములు విషపూరితం కాదని వైద్య నిపుణులు అంటున్నారు. నాగుపాము, కట్లపాము, రక్తపింజర వంటి పాముల వల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సాధారణంగా 50 శాతంపైగా పాముల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు అంటున్నారు. పాము కాటేసిన వెంటనే వైద్యం చేయించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు రక్తపింజర ఎక్కువగా అటవీప్రాంతంలో తిరుగుతుంది. ఈ పాము కాటు వేస్తే 2 గంటల తర్వాత విషం శరీరానికి ఎక్కుతుందని చెబుతున్నారు. రక్తపింజర కాటువేసిన వెంటనే అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆస్పత్రులకు వెళ్లి వైద్యం పొందాలి. నాగుపాము నాగుపాము అత్యంత ప్రమాదకరమైంది. ఈ పాము కాటువేస్తే 15 నిమిషాల్లో విషం ఎక్కుతుందని అంటారు. ముందుగా పాముకాటు వేసిన చోట వెంటనే కట్టు కట్టాలి. తదుపరి పాము కాటుకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించాలి. నాగుపాము విషం ప్రధానంగా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కట్లపాము కట్లపాము కాటువేసిన వెంటనే విషం రక్తంలో కలుస్తుంది. ప్రాణాపాయం ఎక్కువ. పాము కాటు వేసిన వెంటనే ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించాలి. కట్లపాము విషం రక్తంలోకి చేరకముందే వైద్యం చేయిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు పాటించాలి ► పాముకాటుకు గురైన వారు ఎలాంటి ఆందోళన చెందకూడదు. తీవ్రమైన ఒత్తిడికి గురైతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ► పాము కాటువేయగానే గాయాల పైభాగంలో కట్టుకట్టాలి. ► ఏ పాము కాటు వేసిందో తెలుసుకొని యాంటీ వీనమ్(విషానికి విరుగుడు) తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ► రైతులు రాత్రిపూట పొలాలకు వెళ్ళేప్పుడు కాళ్ళకు చెప్పులు, టార్చిలైట్లతో పాటు శబ్దాలు చేసే పరికరాన్ని వెంట తీసుకుని వెళ్ళడం వల్ల పాముకాటు నుంచి రక్షించుకోవచ్చు. అప్రమత్తంగా ఉండాలి పాము నుంచి రక్షించుకునేందుకు అప్రమత్తంగా ఉండాలి. పాముకాటుకు గురైతే యాంటివీనమ్ మందులు అన్ని ప్రాథమిక కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. కాటుకు గురైన వ్యక్తి శరీరంలో మార్పులు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ ప్రవీణ్, పీహెచ్సీ వైద్యాధికారి, దొరమామిడి, బుట్టాయగూడెం మండలం -
ఒకే కుటుంబంలో ముగ్గురికి పాము కాటు
గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామంలో ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు గురువారం తెల్లవారుజామున పాము కాటుకు గురయ్యారు. వీరిలో శ్రీనివాసులు(10) అనే బాలుడు శుక్రవారం మృతి చెందాడు. మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. బైలుప్పల బీసీ కాలనీలో బుర్నా గోవింద్, చంద్రమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు దొరస్వామి, బాలకృష్ణ సంతానం. వీరికి వివాహాలు అయినా ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉంటున్నారు. గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము ఇంట్లోకి ప్రవేశించి దొరస్వామి, అతని ఎనిమిది నెలల కుమారుడిని, అలాగే బాలకృష్ణ కుమారుడు శ్రీనివాసులును కాటు వేసింది. కుటుంబ సభ్యులు దొరస్వామి, ఎనిమిది నెలల బాలుడిని మాత్రమే పాము కాటు వేసిందని భావించి గురువారం తెల్లవారు జామున చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఇంటి దగ్గరే ఉన్న శ్రీనివాసులు పరిస్థితి విషమించింది. గమనించిన కాలనీ వాసులు వెంటనే కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. దొరస్వామి పరిస్థితి కూడా ఆందోళన కరంగా ఉండటంతో ఎమ్మిగనూరును నుంచి కర్నూలు ప్రభుత్వాస్పత్రి తరలించారు. ఎనిమిది నెలల బాలుడు క్షేమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. -
మిద్దైపె నిద్రిస్తున్న భార్యాభర్తకు పాము కాటు... పామును తొక్కి చంపేశారు...
కర్నూలు: రాత్రి మిద్దైపె నిద్రిస్తున్న భార్యాభర్తలను పాము కాటు వేయడంతో భార్య మృతి చెందగా, భర్త ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని గుండ్రేవుల గ్రామంలోని పాత బీసీ కాలనీలో నివాసముంటున్న గొల్ల చిన్న భాస్కర్, లక్ష్మి (38) దంపతులు సోమవారం రాత్రి భోజనం అనంతరం మిద్దైపె నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 11 గంటల అనంతరం గొల్ల చిన్న భాస్కర్‌ను పాము కాటువేయడంతో విదిల్చి పడేయగా పక్కనే ఉన్న లక్ష్మి కాలికి కాటు వేసింది. ఆమె కాలిని వదలకుండా పట్టుకోవడంతో ఇద్దరూ కలిసి పామును తొక్కి చంపేశారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువుల సాయంతో వెంటనే కర్నూలు పెద్దాస్పత్రికి వెళ్లారు. చికిత్స పొందుతూ కోలుకోలేని లక్ష్మి మృతిచెందగా చిన్న భాస్కర్ కోలుకుంటున్నాడు. లక్ష్మి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
నాగుల చవితికి పుట్టలో పాలు ఎందుకు పోస్తారో తెలుసా..? కారణం ఇదే..
Nagula Chavithi 2022: కార్తీక శుద్ధ చతుర్థికి నాగుల చవితి అని పేరు. ఈనాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని విశ్వాసం. మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి వున్న వెన్నెముకను ‘వెన్నుబాము’ అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో ‘పాము’ ఆకారంలో వుంటుందని యోగశాస్త్రం’ చెబుతోంది. చదవండి: World Stroke Day: సమయం లేదు మిత్రమా! ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ‘సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు ‘నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పాలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుందని, అదే పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని పండితులు చెప్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వరంగల్ ఎంజీఎంలో ఎలుకలు, పాములు
-
సర్ప సంరక్షకుడు క్రాంతి..
సాక్షి,జంగారెడ్డిగూడెం : పాము కనిపిస్తే మనకు ఒళ్లు జలదరిస్తుంది. వెంటనే ఆమడ దూరం పారిపోతాం. కానీ ఆ యువకుడు మాత్రం పాము కనిపిస్తే చాలు దాన్ని ఎంతో సులువుగా పట్టుకుని ప్రజల నుంచి హాని కలగకుండా సురక్షిత ప్రాంతంలో విడిచిపెడతాడు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన చదలవాడ క్రాంతి కుమార్‌ను అందరూ ఆ ప్రాంతంలో పాముల సంరక్షకుడిగా పిలుస్తారు. ఏటా జూలై 16న ప్రపంచ పాముల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆ రోజుని పురస్కరించుకుని స్నేక్ సేవియర్‌గా పేరు తెచ్చుకున్న క్రాంతి గురించి తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచే ఆసక్తి డిగ్రీ వరకు చదివిన క్రాంతి చిన్నప్పటి నుంచి వన్యప్రాణులకు హాని తలపెట్టకూడదనే ఆలోచనతో పెరిగాడు. ఎవరైనా వాటికి హాని కలిగిస్తే వారికి అవగాహన కల్పించేవాడు. చాలామంది పాములను చంపడం చూసి వాటిని రక్షించాలని నిర్ణయించుకున్నాడు. వాటిని సురక్షితంగా పట్టుకోవడంలో శిక్షణ పొందాడు. శిక్షణ అనంతరం విశాఖపట్నంలో ఉన్న స్నేక్ సేవియర్ సొసైటీలో పాములపై రీసెర్చ్ మొదలుపెట్టాడు. అతి తక్కువ కాలంలోనే పాములను సురక్షితంగా పట్టుకోవడంలో పేరుగాంచాడు. అనేక గ్రామాల్లో పర్యటించి పాముల్ని చంపకుండా ఎలా వాటి నుంచి రక్షించుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తున్నాడు. ఇంతవరకు జనావాసాలు, ఇళ్ల మధ్యకు వచ్చిన 10,900 పాములను పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టాడు. పశ్చిమగోదావరి జిల్లాలో అనేక మండలాల్లో ఇంట్లో, ఇంటి పరిసరాల్లో పాము కనిపిస్తే వెంటనే గుర్తుకొచ్చేది క్రాంతి పేరే. 83869 84869, 80998 55153 నెంబర్లకు ఫోన్ చేయగానే ఆ ప్రాంతానికి వెళ్లి పామును పట్టుకుని సురక్షితంగా విడిచిపెడుతుంటాడు. పాములతో పర్యావరణానికి మేలు మొట్టమొదటి సారిగా కెనడాలో ప్రపంచ పాముల దినోత్సవాన్ని నిర్వహించారు. పాములనేవి పర్యావరణానికి మంచి చేస్తాయని గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా 3,458 సర్పజాతులు ఉండగా.. వీటిలో కింగ్ కోబ్రా, తాచుపాము, పొడపాము, కట్లపాము, రక్తపింజర విషపూరితమైనవి. – చదలవాడ క్రాంతికుమార్, పేరంపేట -
పేదరికపు కాటు: ఇల్లు ఉంటే ఇలాగయ్యేది కాదు
తిరువంతపురం: ఆదిత్య పదేళ్ల పాపాయి. అమ్మానాన్న, తను మాత్రమే ఉన్నామనుకుంది. తమతోపాటు మరో ప్రాణి కూడా తమ ఇంటికి వస్తూ పోతూ ఉందని ఆ పాపాయికి తెలియదు. ఆ ప్రాణి ఓ రోజు నాన్న ఇంట్లో లేనప్పుడు వచ్చింది. ఐదవ తరగతి చదువుతున్న ఆదిత్య హోమ్‌వర్క్ చేసుకుని, అమ్మ పెట్టిన అన్నం తిని నేల మీద పరుపు పరుచుకుని నిద్రపోయింది. ఆమె పడుకున్న తర్వాత ఆ ప్రాణి ఎప్పుడు వచ్చిందో తెలియదు. వచ్చి పాపాయిని కాటేసింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు ఆదిత్య పడుకున్న పరుపు కిందకు దూరింది. తెల్లవారింది. ఆదిత్య ఎప్పటిలాగ నిద్రలేవలేదు. తల్లి సింధు ఆమెను నిద్రలేపుతుంటే బలవంతంగా కళ్లు తెరుస్తోంది, అంతలోనే కళ్లు మూతలు పడుతున్నాయి. ముఖం ఉబ్బి ఉంది. ఆదిత్య తల్లికి ఏదో అనుమానం వచ్చింది. రాత్రి ఏదో కుట్టినట్లు అనిపించిన మాట నిజమేనని, చీమ కాబోలని చెప్పింది ఆదిత్య. నిజానికి అది చీమ కాదు. పరిస్థితులు ఎదురుతిరిగినప్పుడు చలిచీమల చేత చిక్కి నిస్సహాయంగా ప్రాణాలు వదిలే విషసర్పం. ఆదమరిచి నిద్రపోతున్న ఆదిత్య దగ్గర తన ప్రతాపం చూపించిందా సర్పం. పాపాయిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ ఆమెను కాటేసినది అత్యంత విషపూరితమైన సర్పం. మనిషి ఒంట్లోకి చేరగానే నరాల మీద ప్రభావం చూపిస్తుంది. న్యూరోపెరాలసిస్‌కు దారి తీస్తుంది. ఆదిత్య పరిస్థితి మరింతగా విషమించడంతో శనివారం నాడు పుష్పగిరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు మార్చారు. ఆదిత్య ప్రాణాలు కాపాడడం కోసం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. శాశ్వత నిద్రలోకి జారిపోయింది. ఈ సంఘటన కేరళ రాష్ట్రం, కొల్లం జిల్లా, పాథనాపురం, అంబేద్కర్ కాలనీలో జరిగింది. ఇల్లు ఉంటే ఇలాగయ్యేది కాదు ఆదిత్య తండ్రి రాజీవ్ కంటికి మంటకి ఏకధాటిగా ఏడుస్తున్నాడు. నా బంగారు తల్లిని పొట్టనపెట్టుకున్నది పాము కాదు ప్రభుత్వం అంటున్నాడు. ‘‘మాకు పక్కా ఇల్లు ఇచ్చి ఉంటే మా పరిస్థితి ఇలాగయ్యేది కాదు. పక్కా ఇంటికోసం ఎన్నిసార్లు గోడు వెళ్లబోసుకున్నప్పటికీ ప్రభుత్వానికి పట్టనేలేదు. ఇప్పుడు నా బిడ్డ బలయిపోయింది’’ అని కన్నీళ్ల పర్యంతం అవుతున్నాడు ఆదిత్య తండ్రి. అతడి ఆవేదనలో అర్థం ఉంది. ఆ కుటుంబం నివసిస్తున్న ఇల్లు అత్యంత దయనీయంగా ఉంది. బొంతరాళ్లను గోడలుగా పేర్చుకుని, పైన నీలం రంగు పాలిథిన్ పట్ట పరుచుకున్నాడు. గోడలకు ఉన్న రంధ్రాల నుంచి తేళ్లు, జెర్రుల వంటివి ఇంట్లోకి ప్రవేశించడం కష్టమేమీ కాదు. ఇప్పుడు ఏకంగా పామే వచ్చింది. పేదరికానికి పేగుబంధాన్ని బలి చేసింది. పైకి పాము కాటుగా కనిపిస్తుంది, కానీ నిజానికి ఇది పేదరికపు కాటు. పేదరికం మీద ప్రభుత్వ వేసిన నిర్లక్ష్యపు వేటు. -
బైక్‌లో దూరిన పాము
ఆత్మకూరు: ద్విచక్రవాహనంలో దూరిన ఓ పాము కలకలం రేపింది. గొరిదిండ్లకు చెందిన రాము శనివారం ఉదయం తన ద్విచక్రవాహనంలో ఆత్మకూరుకు బయల్దేరాడు. పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే బైక్ నడుపుతున్న రాము కుడిచేతి మీదకు ఒక పాము పాకుతూ వచ్చింది. బిత్తరపోయిన ఆయన వెంటనే బండి ఆపాడు. అయితే ఆ పాము డూమ్లోకి వెళ్లి బయటకు రాలేదు. సమీపంలోని మెకానిక్ వద్ద డూమ్ తెరిపించగా బయటకు వచ్చిన పాము స్థానికులపైకి వస్తుండటంతో అరవింద్ అనే వ్యక్తి కర్రతో దాన్ని చంపేశాడు. ఇంటి ముందు ద్విచక్రవాహనం ఉంచినపుడు పాము ఎక్కి ఉండొచ్చని భావిస్తున్నారు.